ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
స్మృతి ఖన్నా(జననం 1990 జూలై 6) ఒక భారతీయ టెలివిజన్ నటి, మాజీ మోడల్.[1][2] ఆమె ఛానల్ వి ఇట్స్ కాంప్లికేటెడ్ లో జో పాత్రను, కలర్స్ టీవి మేరీ ఆషికి తుమ్ సే హిలో రితికా జవేరి పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[3]
స్మృతి ఖన్నా మొదటి వివాహం తన హైస్కూల్ ప్రియుడితో 22-23 వయస్సులో జరిగింది. అయితే, వారు ఒక సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె నటుడు గౌతమ్ గుప్తాని 2017 నవంబరు 23న వివాహం చేసుకుంది. వారి మొదటి కుమార్తె 2020 ఏప్రిల్ 15న, రెండవ కుమార్తె 2024 సెప్టెంబరు 5న జన్మించారు.[4]
2013లో ఆమె జాట్ ఎయిర్వేస్ అనే పంజాబీ చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరి 2015లో ఆమె యే హై ఆషికీలో రీవా పాత్రను పోషించింది. అదే సంవత్సరంలో, ఆమె నాదానియాన్ లో అతిధి పాత్రలో కనిపించింది. ఆమె మేరీ ఆషికి తుమ్ సే హీ లో రితికా జవేరి పాత్రను పోషించిది. జూన్ 2016లో, కలర్స్ టీవీ బాలికా వధు లో వందన పాత్రను పోషించడానికి సిద్ధమైంది.[5][6] ఆ తరువాత, ఆమె కసమ్ తేరే ప్యార్ కీ లో మలైకా గా, ఇస్ ప్యార్ కో క్యా నామ్ డూన్ 3లో సాషా గా నటించింది.[7][8]
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2013-2014 | ఇట్స్ కాంప్లికేటెడ్ | జో | ||
2014-2016 | మేరీ ఆషికి తుమ్ సే హి | రితికా జవేరి | ||
2015 | నాదానియాన్ | |||
యే హై ఆషికి | రీవా ఖన్నా | ఎపిసోడిక్ పాత్ర | ||
2016 | సి. ఐ. డి. | సీతల్ | ||
బాక్స్ క్రికెట్ లీగ్ 2 | పోటీదారు | |||
సూపర్ విలన్స్ వర్సెస్ సూపర్ కాప్స్ | నిషా | |||
బాలికా వధు | వందన మిట్టల్ | |||
2016-2017 | కసమ్ తేరే ప్యార్ కీ | మలైకా మల్హోత్రా | ||
2017 | ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ 3 | సాషా |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2013 | జాట్ ఎయిర్వేస్ | స్వీటీ | పంజాబీ సినిమా | |
2022 | ధప్పా | కవిత | హంగామా ఒరిజినల్ వెబ్ సిరీస్ |
{{cite news}}
: |last=
has generic name (help)