వక్కలంక స్వప్నసుందరి | |
---|---|
![]() స్వప్నసుందరి - విలాసినీ నృత్యం | |
జననం | చెన్నై |
ఇతర పేర్లు | పద్మభూషణ్ స్వప్నసుందరి, స్వప్నసుందరి రావు, వక్కలంక స్వప్నసుందరి |
వృత్తి | భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, గాయని |
తల్లిదండ్రులు |
|
బంధువులు | వక్కలంక పద్మ (సోదరి) |
స్వప్నసుందరి భారతీయ నర్తకి. ఆమె ప్రధానంగా కూచిపూడి, భరత నాట్యం నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె గాయకురాలు కూడా.[1]
2003లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[2] అలాగే సాహిత్య కళా పరిషత్, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ఆమె వీటితో పాటుగా అనేక పురస్కారాలు అందుకుంది. ఆమె ఆల్బమ్ జన్మభూమి మేరీ ప్యారీ మంచి ఆదరణ పొందింది.[3] ఆమె ది వరల్డ్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్, ట్రేసింగ్ ది రూట్స్ ఆఫ్ ది క్లాసికల్ డ్యాన్స్ వంటి పుస్తకాలు రాసింది. ఆమె ఢిల్లీలోని కూచిపూడి డ్యాన్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు, దర్శకురాలు కూడా.
చెన్నైలో జన్మించిన ఆమె ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి, కాకినాడ లతో పాటు ఢిల్లీలో నివసించింది. ఆమె తెలుగు సినిమా ప్రముఖ గాయని వక్కలంక సరళ కూతురు.
ఈమె కూచిపూడి నాట్యాన్ని పసుమర్తి సీతారామయ్య, వెంపటి చినసత్యంల వద్ద అభ్యసించింది. భరతనాట్యాన్ని కె.ఎన్.దక్షిణామూర్తి, అడయార్ కె.లక్ష్మణ్, బి.కళ్యాణ సుందరంల పర్యవేక్షణలో నేర్చుకుంది. కళానిధి నారాయణన్ వద్ద అభినయంలో ప్రత్యేక శిక్షణను తీసుకున్నది.
ఈమెకు నాట్యంతో పాటుగా కర్ణాటక సంగీతంలో కూడా గొప్ప పరిజ్ఞానం ఉంది. ఈమె టి.ముక్త వద్ద పదములను ఆలపించడంలో ప్రత్యేక శిక్షణను పొందింది. ఈ శిక్షణ ఈమెకు సంప్రదాయ పదాలకు నృత్యం చేయడంలో ఉపయోగపడింది.
ఈమె ఆలయ సంప్రదాయ నృత్య రీతులపై ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసింది. మరుగుపడిన "విలాసినీ నృత్యా"న్ని వెలికితీసి పునరుద్ధరించి మద్దుల లక్ష్మీనారాయణ సహకారంతో దానికి ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఆమె సోదరి వక్కలంక పద్మ 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో నటించింది.[4] ఇక స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి వక్కలంక సరళ జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు వక్కలంక సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[5][6]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)