Swami Anand స్వామి ఆనంద్ | |
---|---|
జననం | హిమాత్లాల్ దేవ్ 1887 సెప్టెంబరు 8 |
మరణం | 25 జనవరి 1976 | (aged 88–89)
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
స్వామి ఆనంద్ (1887-1976 జనవరి 25) భారతదేశానికి చెందిన సన్యాసి, గాంధేయవాది ఇంకా గుజరాతి రచయిత. ఇతను గాంధీ ప్రచురించిన నవజీవన్ ఇంకా యువభారత్ పత్రికలకు నిర్వాహకుడిగా జనాదరణ పొందాడు. గాంధీ తన ఆత్మకథ సత్యశోధన రాయడానికి అతనికి ప్రేరణగా నిలిచాడు.[1] ఆనంద్ జీవిత చరిత్రలు, తత్వ శాస్త్రం, ప్రయాణ కథనాలు రచించాడు కొన్ని అనువదించాడు కూడా.
స్వామి ఆనంద్ వాద్వాన్ ప్రాంతం సమీపంలోని షియాని గ్రామంలో 1887 సెప్టెంబరు 8న రామచంద్ర ద్వివేది పార్వతి దంపతులకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రామచంద్ర ద్వివేది ఒక ఉపాధ్యాయుడు. బాంబే లో పుట్టి పెరిగిన స్వామి ఆనంద్ తన పది సంవత్సరాల వయసులో ఉండగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది దానికి వ్యతిరేకంగా సన్యాసిగా మారాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు వివిధ సన్యాసులతో కలిసి చాలా ప్రదేశాలు సందర్శించాడు. ఇతను యవ్వనంలో ఉండగానే స్వామి ఆనందానంద్ గా పేరు మార్చుకుని రామకృష్ణ మఠం లో సన్యాసం స్వీకరించాడు.[2][3][4]
స్వామి ఆనంద్ 1905 బెంగాల్ విప్లవకారులతో సాంగత్యం ఏర్పడిన తర్వాత భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం మొదలెట్టాడు. ఆ తర్వాత 1907లో బాలగంగాధర్ తిలక్ స్థాపించిన కేసరి అనే మరాఠీ పత్రికలో పని చేసాడు. గ్రామ స్థాయిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నాడు. అదేసమయంలో రాష్ట్రమట్ అనే ఒక పత్రికను మరాఠీ భాషలోనుండి గుజరాతి లోకి అనువదించేవాడు. ఈ పత్రిక మూతపడ్డ తర్వాత 1909లో హిమాలయాల్లోకి చేరుకున్నాడు. 1912లో దివ్యజ్ఞాన సమాజం లో కీలక పాత్ర పోషించిన అనిబిసెంట్ స్థాపించిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.[5][6]
మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత 1915 జనవరి 10న స్వామి ఆనంద్ ని కలిసాడు. గాంధీ విదేశాల నుండి తిరిగి వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత నవజీవన్ అనే పత్రికను ప్రారంభించాడు. 1919 సంవత్సరం లో నవజీవన్ పత్రిక ప్రారంభించిన తొలినాళ్లలో దానికి సంబంధించిన పని భారం ఎక్కువ కావడం మొదలైంది, దీంతో దాని బాధ్యత స్వామి నిర్వహించడం మొదలెట్టాడు. యువభారత్ పత్రిక నిర్వహణకారుడిగా , సంపాదకుడిగా ఆనంద్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. మహమ్మద్ అలీ జౌహర్ విరాళంగా అందించిన ప్రింటింగ్ సామాగ్రితో యువ భారత్ పత్రిక ప్రచురణలు మరింత వేగవంతం చేశాడు. యువభారత్ పత్రికలో ప్రచురించిన అంశాలపై వివాదంతో, 1922 మార్చి 18న అరెస్టు చేయబడిన స్వామి ఆనంద్ ఒకటిన్నర సంవత్సరాలు జైలులో గడిపాడు.[7][8] [9]