స్వామి రాందాస్ | |
---|---|
జననం | కన్హంగాడ్, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళ) | 1884 ఏప్రిల్ 10
మరణం | 1963 జూలై 25 | (వయసు 79)
స్వామి రాందాస్ (1884 ఏప్రిల్ 10 - 1963 జులై 25) ఒక భారతీయ సన్యాసి, తత్వవేత్త, దాత, యాత్రికుడు. ఈయన తన ముప్ఫైల్లో సన్యాసం స్వీకరించి దేశాటన చేస్తూ కేరళలోని కన్హంగాడ్ దగ్గర ఆనందాశ్రమాన్ని స్థాపించాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడు. వాటిలో బాగా ప్రాచుర్యం పొందింది ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్ (In quest of God - 1925) అనే పేరుతో వచ్చిన ఆయన ఆత్మకథ. ఈయన అన్ని మతాలు, విశ్వాసాలు ఒకటే అనీ, అన్నీ ఒకే దేవుడిని చేరుకునేందుకు వేరు వేరు మార్గాలు అని విశ్వసించాడు.
ఈయన అసలు పేరు విఠల్ రావు. 1884 ఏప్రిల్ 10 న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ లోని కన్హంగాడ్ లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాలకృష్ణారావు, లలితాబాయి.[1]