స్వామి సత్యమిత్రానంద్ (1932 సెప్టెంబరు 19 - 2019 జూన్ 25), స్వామి సత్మిత్రానంద గిరి గా సుపరిచితుడు. అతను హిందూ ఆధ్యాత్మిక గురువు. అతను 1932 సెప్టెంబరు 19 న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో అంబికా ప్రసాద్‌గా జన్మించాడు. అతను జ్యోతిర్ మఠం యొక్క ఉపపీఠం నకు జగర్గురు శంకరాచార్యగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఆయన హరిద్వార్‌లోని భారత మాతా మందిర్ అనే దేవాలయాన్ని స్థాపించాడు. 1988లో సమన్వయ సేవా ఫౌండేషన్‌ను స్థాపించాడు.
1969 జూన్ లో స్వామిజీ తన జగద్గురు శంకరాచార్య హోదాను వదులుకున్నాడు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.[1]