సచిన్ పైలట్ | |||
![]()
| |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 డిసెంబరు 17 | |||
ముందు | అజిత్ సింగ్ మెహతా | ||
---|---|---|---|
నియోజకవర్గం | టోంక్ | ||
పదవీ కాలం 2018 డిసెంబరు 17 – 2020 జులై 14 | |||
గవర్నరు | కళ్యాణ్ సింగ్ కల్రాజ్ మిశ్రా | ||
ముందు | కమల బేణీవాల్ (2003) | ||
రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష్యుడు
| |||
పదవీ కాలం 2014 జనవరి 13 – 2020 జులై 14 | |||
ముందు | సీ.పీ. జోషి | ||
తరువాత | గోవింద్ సింగ్ దోతాస్ర | ||
పదవీ కాలం 2012 అక్టోబరు 29 – 2014 మే 24 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | వీరప్ప మొయిలీ | ||
తరువాత | అరుణ్ జైట్లీ | ||
కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి
| |||
పదవీ కాలం 2009 మే 28 – 2012 అక్టోబరు 28 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 మే 16 – 2014 మే 16 | |||
ముందు | రాసా సింగ్ రావత్ | ||
తరువాత | సన్వార్ లాల్ జట్ | ||
నియోజకవర్గం | అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2004 మే 17 – 2009 మే 16 | |||
ముందు | రామ పైలట్ | ||
తరువాత | కిరోడి లాల్ మీనా | ||
నియోజకవర్గం | దౌసా లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సహరాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1977 సెప్టెంబరు 7||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాజేష్ పైలట్ (నాన్న) రామ పైలట్ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | సారా పైలట్ (వివాహం 2004) | ||
బంధువులు | ఫారూఖ్ అబ్దుల్లా (మామయ్య, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి) ఒమర్ అబ్దుల్లా (బావమరిది, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి) | ||
సంతానం | ఆరన్, వేహాన్ | ||
పూర్వ విద్యార్థి | బీఏ (సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ) ఎంబీఏ, యూనివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియా |
సచిన్ పైలట్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి.[1] అతను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు. అతను 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]
సచిన్ పైలట్ 1977 సెప్టెంబరు 7న సహరాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజేష్ పైలట్ (మాజీ కేంద్ర మంత్రి), రమ పైలట్ దంపతులకు జన్మించాడు. అతను పూర్వీకులది ఉత్తరప్రదేశ్ లోని వైద్ పుర. సచిన్ న్యూ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో పదవ తరగతి వరకు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో బీఏ వరకు చదివాడు. అతను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.
రాజేష్ పైలట్ 2004లో దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచాడు. అతను వయస్సు అప్పుడు 26 ఏళ్ళు, అతను అతిపిన్న వయస్సులో ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించాడు. అతను 2009లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ మహేశ్వరి పై ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజేష్ పైలట్ యూపీఏ ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహాయమంత్రిగా పని చేశాడు. అతను 2009లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజేష్ పైలట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.
ఎన్నికలు | పార్టీ | పార్లమెంట్ | నియోజకవర్గం | ఫలితం | |
---|---|---|---|---|---|
2004 పార్లమెంట్ ఎన్నికలు | కాంగ్రెస్ పార్టీ | లోక్‌సభ | దౌసా లోక్‌సభ నియోజకవర్గం | గెలుపు | |
2009 పార్లమెంట్ ఎన్నికలు | అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం | గెలుపు | |||
2014 పార్లమెంట్ ఎన్నికలు | ఓటమి | ||||
2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు | కాంగ్రెస్ పార్టీ | రాజస్థాన్ అసెంబ్లీ | టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం | గెలుపు |
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌పై ఆగ్రహంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకుని వెళ్లారు. సచిన్ పైలట్ తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని ప్రకటించాడు.[3] ఈ సంక్షోభ సమయంలో సచిన్ పైలట్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. సచిన్ పైలట్ బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం జరిగింది.[4]
ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ నివాసంలో శాసనసభా పక్షం సమావేశం ఉందని, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఉండడం తప్పనిసరి అని ఆదేశించింది. అనంతరం అసంతృప్త నేత సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటించాడు.[5]
{{cite news}}
: |archive-date=
/ |archive-url=
timestamp mismatch; 7 మే 2021 suggested (help)CS1 maint: extra punctuation (link)