హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() | |||||||||||
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | భారత వైమానిక దళం | ||||||||||
కార్యనిర్వాహకత్వం | ట్రైనింగ్ కమాండ్, భారత వైమానిక దళం | ||||||||||
సేవలు | హైదరాబాదు | ||||||||||
ప్రదేశం | హకీంపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, తెలంగాణ | ||||||||||
ఎత్తు AMSL | 2,020 ft / 616 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°19′52″N 78°18′46″E / 17.3312°N 78.3129°E | ||||||||||
రన్‌వే | |||||||||||
|
హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోవున్న ఎయిర్ ఫోర్స్ స్టేషను.[1] భారతీయ వైమానిక దళం పరిధిలోవున్న ఈ ట్రైనింగ్ కమాండ్ ఫోర్స్ స్టేషను నాంపల్లి రైల్వే స్టేషన్ ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు ఉత్తరాన 8 కి.మీ.ల దూరంలో ఉంది. ఇందులో ఫైటర్ ట్రైనింగ్ వింగ్, హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్, నెం. 43 ఎక్విప్‌మెంట్ డిపో, అనుబంధ యూనిట్లు ఉన్నాయి.[2] తూర్పు-పడమర (09-27), 7,384 అడుగులు (2,251 మీ.) పొడవు x 150 అడుగులు (46 మీ.) వెడల్పుతో రన్‌వే ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా రవాణా ఎయిర్‌ఫీల్డ్‌గా ఈ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను ఉపయోగించబడింది. భారత స్వాతంత్ర్యం తరువాత ఆపరేషన్ పోలో జరిగిన తరువాత హైదరాబాద్ నిజాం అధికారంలోకి రాలేదు. ఆ సమయంలో ఈ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను నిరుపయోగంగా ఉంది.[3] భారత వైమానిక దళంలోకి కొత్తగా నియమించబడిన పైలట్లకు ట్రైనింగ్ అందించడానికి 1951లో ఇందులో కన్వర్షన్ అండ్ ట్రైనింగ్ యూనిట్ ప్రారంభించబడింది. సిటియు ప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ దశ ముగిసిన తర్వాత 1958లో జెట్ ట్రైనింగ్ వింగ్ గా పేరు మార్చబడింది. 1964, జూన్ లో నంబర్ 2 జెటిడబ్ల్యూ (బీదరులో ఉంది) లో విలీనం చేయబడింది, దీనిని ఫైటర్ ట్రైనింగ్ వింగ్‌గా పేరు మార్చారు. 1948, డిసెంబరులో ఇది 'ఎయిర్ ఫోర్స్ స్టేషన్' స్థాయికి ఎదిగింది. 2001లో ఇందులో స్టేషన్ మ్యూజియం స్థాపించబడింది.[4]
1995లో హెలికాప్టర్ స్ట్రీమ్‌లో, 2016లో ఫైటర్ స్ట్రీమ్‌లో లేడీ పైలట్‌లకు ఫ్లైయింగ్ ట్రైనింగ్ ప్రారంభించారు. ఈ స్టేషన్ సిబ్బంది వివిధ సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యలలో కూడా పాల్గొంటారు. ఇక్కడి సిబ్బంది అత్యుత్తమ పనితీరును గుర్తించి 2019లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు రంగులను ప్రదానం చేశాడు.[5]
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)