హకీమ్ అజ్మల్ ఖాన్ | |
---|---|
![]() అజ్మల్ ఖాన్ చిత్రం | |
18వ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు | |
In office 1921–1922 | |
అంతకు ముందు వారు | సి.విజయరాఘవాచార్యులు |
తరువాత వారు | చిత్తరంజన్ దాస్ |
జననం | [1] | 1868 ఫిబ్రవరి 11
మరణం | 1927 డిసెంబరు 20 | (వయసు: 59)
సమాధి స్థలం | పంచకుయాన్ రోడ్‌లోని హజ్రత్ రసూల్ నుమా సమ్మేళనం, ఢిల్లీ, భారతదేశం |
స్మారక చిహ్నం | ఢిల్లీ టిబ్బియా కళాశాల, జామియా మిలియా విశ్వవిద్యాలయం |
జాతీయత | ![]() |
వృత్తి | వైద్యుడు, రాజకీయవేత్త, ఆధ్యాత్మిక వైద్యుడు, సూఫీ ఆధ్యాత్మికవేత్త, మూలికా శాస్త్రవేత్త, కవి |
వీటికి ప్రసిద్ధి | జామియా మిలియా ఇస్లామియా టిబ్బియా కాలేజ్ వ్యవస్థాపకుడు, ఢిల్లీ వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు ఆల్-ఇండియా ముస్లిం లీగ్ అధ్యక్షుడు, భారత జాతీయ కాంగ్రెస్ |
గుర్తించదగిన సేవలు | హాజిక్ |
పిల్లలు | 1 |
కుటుంబం | ఖండాన్ ఇ షరీఫీ |
మొహమ్మద్ అజ్మల్ ఖాన్ (1868 ఫిబ్రవరి 11- 1927 డిసెంబరు 29), హకీం అజ్మల్ ఖాన్ అనికూడా అంటారు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులలో ఒకడు.ఇతను ఢిల్లీలో ఒక వైద్యుడు, అతను ఆయుర్వేద, యునాని టిబ్బియా కళాశాల స్థాపించాడు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఉన్న టిబ్బియా కళాశాలగా ప్రసిద్ధి చెందింది.అతను హిందూ మహాసభలకు అధ్యక్షత వహించిన ఏకైక ముస్లిం రాజకీయనాయకుడు. అతను 1920 లో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మొదటి ఛాన్సలర్ అయ్యాడు.1927లో మరణించే వరకు అతను ఆపదవిలో కొనసాగాడు. [2]
1868 ఫిబ్రవరి 11 న జన్మించాడు. (1284 షవ్వాల్), ఖాన్ మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో భారతదేశానికి వచ్చిన వైద్యుల కుటుంబం నుండి ఉద్బవించిన వ్యక్తి. అతని కుటుంబ సభ్యులందరూ యునాని వైద్యులు (హకీంలు ఈ పురాతన ఔషధ వైద్యం దేశానికి వచ్చినప్పటి నుండి అభ్యసించారు. అప్పుడు వారిని ఢిల్లీ రైస్ అని పిలిచేవారు.అతని తాత, హకీం షరీఫ్ ఖాన్, మొఘల్ చక్రవర్తి షా ఆలంకి వైద్యుడు, షరీఫ్ మంజిల్, హాస్పిటల్-కమ్-కళాశాలలో యునానీ వైద్యవిద్య బోధించేవాడు. [3] [4] [5]
హకీమ్ అజ్మల్ ఖాన్ ఖురాన్‌ను హృదయపూర్వకంగా నేర్చుకున్నాడు. చిన్నతనంలో అరబిక్, పర్షియన్‌తో సహా సాంప్రదాయ ఇస్లామిక్ జ్ఞానాన్ని అభ్యసించాడు, అతని సీనియర్ బంధువుల మార్గదర్శకత్వంలో వైద్య అధ్యయనానికి తన శక్తిని మార్చడానికి ముందు, వారందరూ ప్రసిద్ధ వైద్యులు.[5] టిబ్-ఇ-యునానీ లేదా యునాని వైద్యం అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి, అతని తాత షరీఫ్ మంజిల్ హాస్పిటల్-కమ్-కళాశాల ఉపఖండం అంతటా ప్రసిద్ధి చెందింది.పేద రోగులకు ఉచిత చికిత్స అందిస్తూ అత్యుత్తమ దాతృత్వ యునాని ఆసుపత్రులలో ఒకటిగా దీనిని స్థాపించాడు. అతను ఢిల్లీలోని సిద్ధిఖీ దవాఖానాకు చెందిన హకీమ్ అబ్దుల్ జమీల్ వద్ద యునానీ చదువును పూర్తి చేశాడు.[6]
1892లో అర్హత సాధించిన తరువాత,హకీం అజ్మల్ ఖాన్ రాంపూర్ నవాబుకు ప్రధాన వైద్యుడు అయ్యాడు. "మసీహా-ఇ-హింద్" (భారతదేశం హీలేర్) "కిరీటం లేని రాజు" అని, హకీమ్ అజ్మల్ ఖాన్, తన తండ్రిలాగే, అద్భుత నివారణలను అమలు చేస్తాడని, గుండెజబ్బులకు అధ్భుతమైన ఔషధం అతనివద్ద కలిగి ఉన్నాడని, దీని రహస్యాలు అతనికి మాత్రమే తెలుసుని అతని వైద్య చతురత అలాంటిదని, అతను ఒక వ్యక్తి ముఖాన్ని చూడటం ద్వారా ఏదైనా అనారోగ్యాన్ని గుర్తించగలడని అందరిచేత ప్రశంసించబడ్డాడు.హకీమ్ అజ్మల్ ఖాన్ పట్టణం వెలుపల సందర్శన కోసం రోజుకు 1000 రోగివద్ద నుండి చార్జిచేస్తాడు,కానీ రోగి ఢిల్లీకి వస్తే, అతని సమాజిక స్థానంతో సంబంధం లేకుండా అందరికి ఉచితంగా చికిత్స అందింస్తాడు.భారత స్వాతంత్య్రం, జాతీయ సమైక్యత,మత సామరస్యం వంటి కారణాలకు సాటిలేని సహకారంతో ఖాన్ తన యుగంలో అత్యుత్తమ బహుముఖ వ్యక్తిత్వం నిరూపించుకున్నాడు.
యునాని వైద్యం స్థానిక వ్యవస్థ విస్తరణ, అభివృద్ధిపై అతను చాలా ఆసక్తిని కనబరిచాడు. ఆ దిశగా మూడు ముఖ్యమైన సంస్థలను నిర్మించాడు. ఢిల్లీలోని సెంట్రల్ కాలేజీ, హిందుస్తానీ దవాఖానా, ఆయుర్వేదిక్, యునాని టిబ్బియా కళాశాల (టిబ్బియా కళాశాల), ఢిల్లీ అని పిలుస్తారు.ఈరంగంలో పరిశోధన, అభ్యాసాన్ని విస్తరించింది.భారతదేశంలో యునాని వైద్య వ్యవస్థను అంతరించిపోకుండా కాపాడింది. ఈ రంగంలో అతను చేసిన అలుపెరగని ప్రయత్నాలు బ్రిటిష్ పాలనలో క్షీణిస్తున్న యునాని వైద్య వ్యవస్థలో కొత్త శక్తిని, వైద్య ప్రాముఖ్యతను నిలబెట్టాయి.[7] యునాని వ్యవస్థలో పాశ్చాత్య భావనలను గ్రహించడాన్ని ఖాన్ ప్రతిపాదించాడు.ఈ వ్యవస్థ స్వచ్ఛతను కాపాడుకోవాలనుకునే స్వీకరించిన దృక్పథానికి లక్నో పాఠశాల వైద్యులు పూర్తి విరుద్ధం అని చెప్పాడు. [8]
హకీమ్ అజ్మల్ ఖాన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ సలిముజ్జామన్ సిద్ధిఖీ ప్రతిభను గుర్తించాడు, ఈ రంగంలో ఉపయోగించిన ముఖ్యమైన ఔషధ మొక్కలపై పరిశోధన,తరువాత యునాని వైద్యానికి కొత్త దిశానిర్దేశం చేసింది.[9] దాని వ్యవస్థాపకులలో ఒకరిగా, ఖాన్ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మొదటి ఛాన్సలర్‌గా 1920 నవంబరు 22న ఎన్నికయ్యాడు. 1927లో అతను మరణించే వరకు ఆపదవిలో కొనసాగాడు.ఆ కాలంలో అతను అలీఘర్ నుండి విశ్వవిద్యాలయం ఢిల్లీకి వెళ్లడాన్ని పర్యవేక్షించాడు. ఆర్థిక సంక్షోభాలను అధిగమించడానికి అతను సహాయం చేసాడు,అతను విస్తృతమైన నిధుల సేకరణ చేపట్టినప్పుడు,తరచూ తన సొంత డబ్బును ఉపయోగించి ఆటంకాలు తొలగించాడు [10] [11]
హకీమ్ అజ్మల్ ఖాన్ తన కుటుంబం ప్రారంభించిన ఉర్దూ వారపత్రిక అక్మల్-ఉల్-అక్బర్ కోసం రాయడం ప్రారంభించిన తర్వాత వైద్యం నుండి రాజకీయాలకు మారాడు.1906 లో సిమ్లాలో భారత వైస్రాయిని కలిసిన ముస్లిం బృందానికి ఖాన్ నాయకత్వం వహించాడు.ప్రతినిధి బృందం రాసిన విజ్ఞాపనపత్రం అతనికి అందించాడు.అతను1906 డిసెంబరు చివరిలో 30న అఖిల భారత ముస్లిం లీగ్ ఢాకా స్థాపనలో చురుకుగా పాల్గొన్నాడు.[12] చాలా మంది ముస్లిం నాయకులు అరెస్టును ఎదుర్కొన్న సమయంలో, ఖాన్ 1917లో సహాయం కోసం మహాత్మా గాంధీని సంప్రదించాడు.ఆ తర్వాత ఖిలాపత్ ఉద్యమ నాయకులతో, మౌలానా ఆజాద్ వంటి ఇతర ముస్లిం నాయకులతో అతను ఐక్యం అయ్యాడు.ప్రసిద్ధ ఖిలాఫత్ ఉద్యమంలో మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ తరువాత ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్ష పదవులకు ఎన్నికైన వ్యక్తి.[5]
అతను 1927 డిసెంబరు 29 న గుండె సమస్యలతో మరణించే ముందు, హకీమ్ అజ్మల్ ఖాన్ తన ప్రభుత్వ బిరుదును వదులుకున్నాడు.అతని భారతీయ అనుచరులు చాలామంది అతనికి మసీహ్-ఉల్-ముల్క్ (దేశ వైద్యుడు) అనే బిరుదును ప్రదానం చేశారు. అతను తర్వాత జామియా మిలియా ఇస్లామియా ఛాన్సలర్ పదవికి ముక్తార్ అహ్మద్ అన్సారీ పదవీ బాధ్యతలు తీసుకున్నాడు.[5]
భారతదేశ విభజన తరువాత, ఖాన్ మనవడు హకీమ్ ముహమ్మద్ నబీ ఖాన్ పాకిస్తాన్ వెళ్లాడు. హకీం నబీ తన తాత నుండి వైద్యం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. పాకిస్తాన్ అంతటా శాఖలను కలిగి ఉన్న లాహోర్‌లో 'దవాఖానా హకీమ్ అజ్మల్ ఖాన్' అనే సంస్థను ప్రారంభించాడు. అజ్మల్ ఖాన్ కుటుంబం నినాదం అజల్-ఉల్-అల్లా-ఖుదాతుల్మాల్, అంటే మానవత్వానికి సేవ చేయడం ద్వారా తనను తాను నిత్య జీవితంలో పని ఉండేలాగున చూసుకోవటానికి ఉత్తమ మార్గం అని అర్థాన్ని సూచిస్తుంది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)