హథీరాంజీ బాబా [1], సా.శ. 1200 కాలంలో ఉత్తర భారతదేశం వచ్చిన రాథోడ్ రాజ్య స్థాపకుడు శ్రీ బుద్ధదేవుడి అంశం తో పుట్టిన శ్రీ బుద్దా గోనే మహారాజ్, గొనెంద్ర దేవుడు, గొనెంద్ర స్వామి కొడుకె ఈ హథీ రామ్ తిరుమల కు వచ్చిన భక్తుడు. ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం రోజు[2][3].
శ్రీ హథీరాంజీ బాబా ఆలయం, తిరుమల | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°40′59.7″N 79°20′49.9″E / 13.683250°N 79.347194°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
స్థలం | హథీరామ్ బావాజీ మఠం |
ఎత్తు | 953 మీ. (3,127 అ.) |
సంస్కృతి | |
దైవం | హథిరామ్ బావాజీ, విష్ణుని భక్తుడు |
ముఖ్యమైన పర్వాలు | బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ శైలి |
దేవాలయాల సంఖ్య | 1 |
శాసనాలు | కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు |
చరిత్ర, నిర్వహణ | |
దేవస్థాన కమిటీ | హథీరామ్ బాబా, తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి |
మరొక విషయం పూర్వము నుంచి హథీరామ్ దేవాలయం వాసుదేవుడి నిలయం (విష్ణు మూర్తి అవతారం ఐన శ్రీ కృష్ణుడు తండ్రి )[4] కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతని గదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీ వారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చినా ఇంద్ర దేవుడు గజేంద్రుడు అయినా ఏనుగు చెఱకు గడలన్నీ తినివేశాడు. బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.
బంజారాలు సూర్య వంశ క్షత్రియులు గా పిలవ బడే కుల దేవుని కొన్ని అవతారలు (బంజారాల రాజధాని రాజస్థాన్) ఇంద్ర బటారిక (కర్ణాటక చాలుక్య రాజ్యం) గోనే(ఆవుల మంద) రుద్రదేవుడు (శిల్ప బ్రహ్మ )తూర్పు చాలుక్యూడైనా వెయ్యి స్తంభాల గుడి త్రికూట లేదా త్రిలింగం 1, ఇంద్ర లింగం 2, విష్ణు లింగం,3, శివ లింగం గుర్తు గా ఆలయం కట్టించాడు. సృష్టి,పాలి స్థితి,లయ,అతని కోట మహబూబ్ నగర్ ఘనపూర్ కోట , అతనే గోనెమహరాజ్,గోనే బుద్దా,గోనేంద్ర స్వామి,గోనేంద్రుడు,గోనెంద్ర,గోనే దేవుడు, బాలాజీ,(అంటే 12 సంవత్సరాల బాల వయస్సు లో హథీ రామ్ బావాజీ కి దర్శనం ఇచ్చాడు ) పేర్లతో పిలవబడతాడు,ఇతని కుమారుడే హథీ రామ్ బావాజీ! బల్జా, బలియావాల్ ,బంజారా, లంబాడీ ఇలా క్రమంగా మారిపోయిన పేర్లు హథీరాంజీ తో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది.ఈస్టిండియా కంపెనీ వారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత ఈ కథనం ఆధారంగా 1843 సంవత్సరంలో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు.[5][6]
1932లో తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం అమలులోకి వచ్చింది. అంతకు మునుపు మహంతుల ఆధీనంలో ఉండేది. హథీరాంజీ మఠానికి పెద్ద సంఖ్యలో బంజారాలు,సుగాలీలు, లంబాడీ భక్తులు భారతదేశం నలుమూలలా లో నుండి దర్శనం చేసుకోవటానికి వస్తారు. బంజారాలు,సుగాలీలు, లంబాడీలు హథిరాంజీ తమ తెగకు చెందినవాడని భావిస్తారు. అందువలన తిరుమలలో దర్శనమైన వెంటనే హథిరాంజీ ఆశీర్వాదం పొందడానికి మఠానికి వస్తారు. మఠంలో బంజారాలకు ఉచిత బస ఏర్పాట్లు ఉన్నాయి.[7]
తిరుపతి లోని హథీరాం బాబా మఠానికి సంబందించిన 25 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ మఠం భూములు అక్రమణకు గురి ఆవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించింది. మఠ మాహంతులు సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో తదుపరి విచారణ పూర్తియ్యేంత వరకు అమ్మడానికి వీలు లేదని తేల్చి చేపింది[8][9].