హనుమాన్ జంక్షన్ | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°38′08″N 80°58′19″E / 16.635472°N 80.971845°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | బాపులపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521105 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
ఇదే పేరుతో ఉన్న తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్ గురించి చూడండి.
హనుమాన్ జంక్షన్ , కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామం.
ముందు ఒక పల్లెటూరుగా ఉన్న ఈ జనావాసం లారీ రవాణా కేంద్రంగానూ, వ్యాపార కేంద్రంగానూ అభివృద్ధి చెందుతున్నది.
1950 దశకంలో చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి జనులు ఇక్కడికి వచ్చి స్థిరపడడం మొదలయ్యింది. జాతీయరహదారిపైన ఉన్నందున మొదట్లో హోటళ్ళు వ్యాపారం సాగింది. ఇంద్రభవన్ అనే హోటల్ (ఇప్పుడు ఇది మూత పడింది. ప్రస్తుతం విజయవాడ రోడ్‌లో ఉన్న ఇంద్ర భవన్, ఇది ఒకటి కాదు), రామా స్వీట్స్ (ఇది కూడా మూతపడింది) ఇక్కడ సాగిన మొదటి దుకాణాలలో కొన్ని.
ఇది కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉంది. నాలుగు ముఖ్య పట్టణాల కూడలి గనుక ఇది "జంక్షన్" అని వ్యవహరింప బడుతుంది. ప్రధాన కూడలి నుండి నాలుగు రోడ్లను ఏలూరు రోడ్,గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్ - అనిపిలుస్తారు.
సీతారాంపురం ఆంధ్ర పురం బొమ్ములూరు మల్లవల్లి కనుమలు నూజివీడు రైల్వేస్టేషన్
ఐదవ నెంబరు జాతీయ రహదారి 5 (NH5) (కలకత్తా - మద్రాసు రోడ్డు) [2], బందరు-నూజివీడు రోడ్లు ఇక్కడ "హనుమాన్ మందిరం" వద్ద కలుస్తాయి. ఈ నాలుగురోడ్ల కూడలిలో అభయాంజనేయస్వామి మందిరం ఉంది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. ఈ స్వామి భయాలను హరించి రక్షణనిస్తాడని ఇక్కడివాఱి నమ్మకం.
ఈ గ్రామానికి 1.9 కి.మీ.ల దూరంలో నూజివీడు రైల్వే స్టేషను ఉంది. విజయవాడ, ఏలూరు నగరాల వైపు ఇక్కడి నుండి రైలు సదుపాయం ఉంది.
హనుమాన్ జంక్షన్ స్థాపన, అభివృద్ధికి కారకుడిగా భావించే శ్రీ అభయాంజనేయస్వామి పేరుమీద ఒక త్రాగునీటి పథకం ప్రారంభింంచాలనే కోరికతో శ్రీ నందిగం అప్పారావు అను భక్తుడు, తనకు వేలేరు గ్రామంలో ఉన్న కొద్దిపాటి స్థలాన్నీ, హనుమాన్ జంక్షనులోని ఆంజనేయస్వామికి విరాళంగా ఇవ్వడమేగాక, ఈ పథకానికి అవసరమైన భవన నిర్మాఅనికి ఒక లక్ష రూపాయల నగదును గూడా అందజేసినారు. ధర్మకోనేరు చెరువుగట్టున ప్రారంభమైన భవన నిర్మాణం పూర్తికాకముందే ఆయన రహదారి ప్రమాదంలో అసువులుబాసినారు. అయినా ఆయన సంకల్పాన్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో, గ్రామపెద్దలు పూనుకొని, నీటిశుద్ధియంత్రాలను ఏర్పాటుచేసి, ఈ పథకాన్ని పూర్తిచేసారు. ఒకటిన్నర నెలలనుండి, గ్రామస్థులకు శుద్ధినీటిని అందించుచున్నారు. [9]
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హనుమాన్ జంక్షన్, ఇప్పుడు గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో ఉంది.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి kakani aruna garu, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
ఈ ఆలయం స్థానిక నూజివీడు రహదారిపై ఉంది. ఈ ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించెదరు. [5] ఈ ఆలయ 31వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2016,మే-1వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2వతేదీ సోమవారం ఉదయం స్వామివారికి మూలమంత్ర హోమం నిర్వహించారు. ఆఖరిరోజైన 3వతేదీ మంగళవారంనాడు, ఉదయం మహాపూర్ణాహుతి, కొట్నాలు, అవభృత చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. [11]
ఈ ఆలయంలో వాహన పూజలు అధికంగా జరుగుతాయి.
స్థానిక అభయాంజనేయస్వామి కూడలిలో ఉన్న ఈ ఆలయం 1934లో అప్పటి నూజివీడు జమీందారులచే నిర్మితమైనది.
ఈ ఆలయం తిమ్మనీడు ప్రాంతంలో ఉంది.
ఈ గ్రామంలోని నూజివీడు రహదారి వద్ద, మచిలీపట్నం - కల్లూరు రాష్ట్ర రహదారిపై, రైల్వే పై వంతెన (ఫ్లైవోవరు) సమీప ంలోని శ్రీ సీతారామాలయంలో నిర్మించనున్న 45 అడుగుల ఎత్తయిన భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి, 2013 నవంబరు 20 నాడు, శంకుస్థాపన మరియూ భూమిపూజ, జరిగింది. 16 అడుగుల ఆధారపీఠం, ఆపైన 3 అడుగుల పద్మపీఠం పైన, 45 అడుగుల ఎత్తయిన స్వామివారి విగ్రహం ఉంటుంది. రు. 20 లక్షల అంచనా వ్యూయంతో నిర్మించిన ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,ఫిబ్రవరి-20వ తేదీ శుక్రవారం నుండి 23వ తేదీ సోమవారం వరకు నిర్వహించారు. చివరి రోజైన 23వ తేదీ, సోమవారం ఉదయం ప్రాణప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుఝామున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చతుస్నానార్చనలు నిర్వహించిన తరువాత, తొమ్మిది గంటలకు మహాపూర్ణాహుతి, 10-26 కి కుంభప్రోక్షణ ప్రతిష్ఠా కార్యక్రమం, గోదర్శనం, దర్పణదర్శనం, దిష్టికుంభం, మహా హారతి నిర్వహించారు. అనంతరం దాసాంజనేయస్వామివారి ఆలయంలో శాంతికళ్యాణం, అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, విశేషంగా వేల సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [1], [3] & [6]
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక సంబర మహోత్సవాలు, 2015,మార్చి-21వ తేదీ శనివారం, ఉగాది రోజున నిర్వహించెదరు. ఉదయం 11 గంటలకు గోవిందమాంబ, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారలకు కళ్యాణం నిర్వహించి, కళ్యాణమూర్తులను, పేరంటాలు అమ్మవార్లను, సాయంత్రం ఊరేగించెదరు. రాత్రి 7 గంటలకు అన్నసమారాధన, అనంతరం భక్తిరంజని కార్యక్రమాలు నిర్వహించెదరు. [8]
హనుమాన్ జంక్షన్ ఏలూరు రహదారిలో ఉన్న అప్పనవీడులో, మహావిష్ణు లోకకళ్యాణసమితి ఆధ్వర్యంలో, 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి, 2016,ఫిబ్రవరి-28, ఆదివారంనాడు శంకుస్థాపన నిర్వహించెదరు. ఈ ఆలయ ప్రాంగణంలో, 29 అడుగుల గాలిగోపురం, వేదగాయత్రి ఆగమ పాఠశాల, నందగోకులం గూడా నిర్మించెదరు [11]
మెరక వ్యవసాయమూ,పల్లపు వ్యవసాయమూ కూడా బాగా జరుగుతాయి. వరి, చెరకులతో పాటు ఆయిల్ పామ్ సాగు కూడా పెరిగింది. అంపాపురం వద్ద నూనెమిల్లులో పామాయిల్ ఉత్పత్తి జరుగుతున్నది.
హనుమాన్ జంక్షన్ కథా కేంద్రంగా 2001 లో హనుమాన్ జంక్షన్ అనే తెలుగు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హనుమాన్ జంక్షన్ గా చిత్రీకరించిన ఊరికి అసలు హనుమాన్ జంక్షన్ కీ పోలికే లేదు. మలయాళంలో విజయవంతమైన తేన్‌కాశి పట్టణమ్ సినిమాను తెలుగుసేతే ఈ సినిమా. ఎం.రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతి బాబు, అర్జున్, స్నేహ, లయ నటించారు.
వివిధ జిల్లాలు (కృష్ణా, పశ్చిమ గోదావరి), నియోజక వర్గాలు, మండలాలు (బాపులపాడు, ఏపూరు), పంచాయితీల (బాపులపాడు, ఏపూరు, తాళ్ళమూడి, అప్పనవీడు) మధ్య పట్టణం విభజింపబడి ఉండడం వలన పౌర సమస్యల పరిష్కారానికి, పట్టణం అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. హనుమాణ్ జంక్షన్‌కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్‌కు "నూజివీడు రైల్వేస్టేషన్" అని పేరు (అప్పటికి హనుమాన్ జంక్షన్ జనావాసంగా అభివృద్ధి కాలేదు)
Smart junction app
[1] ఈనాడు విజయవాడ; 2013,నవంబరు 21; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2013,జనవరి-24; 15వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జూన్-16; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-4; 4వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014,డిసెంబరు-16; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-24; 3వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-13; 4వపేజీ. [8] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-21; 5వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-12; 4వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,మే-27; 5వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2016,మే-4; 5వపేజీ.