వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఫతే జంగ్, పంజాబ్, పాకిస్తాన్ | 1991 మార్చి 16|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.89 మీ. (6 అ. 2 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | హసీబ్ ఆజం (సోదరుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 180) | 2011 ఏప్రిల్ 23 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2012 మార్చి 22 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 46) | 2012 ఫిబ్రవరి 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2013 జూలై 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–present | Rawalpindi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–present | National Bank of Pakistan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2015 | Rawalpindi Rams | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Khulna Royal Bengals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | Uva Next | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | లాహోర్ కలందర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018; 2020 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | ముల్తాన్ సుల్తాన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | Northern | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021-present | Golden State Grizzlies | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 డిసెంబరు 27 |
హమ్మద్ ఆజం (జననం 1991, మార్చి 16) పాకిస్థాన్ క్రికెటర్. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడాడు. 2011 - 2015 మధ్య పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్‌మెన్, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 2023 జూలైలో పదవి విరమణ పొందాడు.
2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[2][3] 2019 మార్చిలో, 2019 పాకిస్తాన్ కప్ కోసం సింధు జట్టులో ఎంపికయ్యాడు.[4][5] 144 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు పడగొట్టిన తర్వాత టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎంపికయ్యాడు.[6]
2019 సెప్టెంబరులో, 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం నార్తర్న్ జట్టులో ఎంపికయ్యాడు.[7][8] 2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం నార్తర్న్ జట్టులో ఎంపికయ్యాడు.[9][10] పోటీ ముగిసిన తరువాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.[11]
2021 ఏప్రిల్ లో, హ్యూస్టన్ ఓపెన్ టీ20 క్రికెట్ లీగ్‌లో పాల్గొనడానికి యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళిన నలుగురు పాకిస్తానీ క్రికెటర్లలో rతను ఒకడిగా నిలిచాడు.[12] 2021 జూన్ లో, ఆటగాళ్ళ డ్రాఫ్ట్‌ను అనుసరించి యునైటెడ్ స్టేట్స్‌లో మైనర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో గోల్డెన్ స్టేట్ గ్రిజ్లీస్ సభ్యునిగా ఎంపికయ్యాడు.[13]
ఆల్ రౌండర్ అయిన ఆజం 2008లో రావల్పిండి తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌లో జరిగిన లండర్-19 ప్రపంచ కప్‌కు పాకిస్థాన్ జట్టులో ఎంపికయ్యే ముందు అతను కేవలం ఆరు ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడాడు.
ఆరు మ్యాచ్‌ల్లో 173 పరుగులు చేసి ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. సెమీ-ఫైనల్‌లో వెస్టిండీస్‌పై అతను అజేయంగా 92 పరుగులు చేయడంతో పాకిస్థాన్‌ను టోర్నమెంట్‌లో ఫైనల్‌కి చేర్చింది.[14] ఆస్ట్రేలియాతో ట్వంటీ 20 ఇంటర్నేషనల్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[15]
2011 ఏప్రిల్ 23న, మహ్మద్ సల్మాన్, జునైద్ ఖాన్‌లతో కలిసి సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2011 ఏప్రిల్ 25న, సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన రెండవ డిజిసెల్ వన్డేలో మార్లోన్ శామ్యూల్స్ మొదటి వికెట్‌ను ఆజం తీసుకున్నాడు.[16]
2012 ఫిబ్రవరి 23న, దుబాయ్‌లో ఇంగ్లాండ్‌పై తన టీ20లోకి అరంగేట్రం చేశాడు. ఇందులో బ్యాటింగ్ చేయడానికి, బౌలింగ్ చేయడానికి అవకాశం రాలేదు. తరువాతి మ్యాచ్ లో, 15 బంతుల్లో మూడు 4లు, ఒక 6తో సహా 21 పరుగులు చేసి రవి బొపారా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.[17] ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడాడు.