హయాత్‌నగర్ మండలం | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | హయత్‌నగర్ |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,27,195 |
- పురుషులు | 1,16,368 |
- స్త్రీలు | 1,10,827 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 64.57% |
- పురుషులు | 75.25% |
- స్త్రీలు | 52.60% |
పిన్‌కోడ్ | 501505 |
హయత్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] హయాత్‌నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీకి 5 కి.మీ. సమీపంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 29 చ.కి.మీ. కాగా, జనాభా 80,336. జనాభాలో పురుషులు 41,246 కాగా, స్త్రీల సంఖ్య 39,090. మండలంలో 19,339 గృహాలున్నాయి.[3]
హైదరాబాద్ నగర శివారులోని హయాత్‌నగర్ లోని చారిత్రాత్మక కట్టడమే హయాత్ బక్షీ మస్జిద్. గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ మహమ్మద్ భార్య హయాత్‌బక్షీ బేగం. సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. చాలా వరకు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 2,27,195 - పురుషులు 1,16,368 - స్త్రీలు 1,10,827
ఈ గ్రామం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ. లోపు రైల్వే స్టేషను లేదు. కాని మలకపేట రైల్వేస్టేషను, కాచిగూడ రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాద్ ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది.