హరీష్ రావత్ | |||
![]()
| |||
7వ ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్
| |||
---|---|---|---|
పదవీ కాలం 11 మే 2016 – 18 మార్చి 2017 | |||
గవర్నరు | క్రిషన్ కాంత్ పాల్ | ||
ముందు | రాష్రపతి పాలన | ||
తరువాత | త్రివేంద్ర సింగ్ రావత్ | ||
పదవీ కాలం 21 ఏప్రిల్ 2016 – 22 ఏప్రిల్ 2016 | |||
గవర్నరు | క్రిషన్ కాంత్ పాల్ | ||
ముందు | రాష్రపతి పాలన | ||
తరువాత | రాష్రపతి పాలన | ||
పదవీ కాలం 1 ఫిబ్రవరి 2014 – 27 మార్చి 2016 | |||
గవర్నరు | ఆజిజ్ క్కురేషి క్రిషన్ కాంత్ పాల్ | ||
ముందు | విజయ్ బహుగుణ | ||
తరువాత | రాష్రపతి పాలన | ||
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 30 అక్టోబర్ 2012 – 31 జనవరి 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | పవన్ కుమార్ బన్సల్ | ||
తరువాత | గులాం నబీ ఆజాద్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | రాజేంద్ర కుమార్ బడి | ||
తరువాత | రమేష్ పోఖ్రియాల్ | ||
నియోజకవర్గం | హరిద్వార్ | ||
పదవీ కాలం 1980 – 1991 | |||
ముందు | మురళీ మనోహర్ జోషి | ||
తరువాత | జీవన్ శర్మ | ||
నియోజకవర్గం | అల్మోరా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2002 – 2008 | |||
ముందు | మనోహర్ కాంత్ ధ్యాని | ||
తరువాత | భగత్ సింగ్ కొష్యారి | ||
నియోజకవర్గం | ఉత్తరాఖండ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అల్మోరా, ఉత్తరాఖండ్, భారతదేశం) | 27 ఏప్రిల్ 1948||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాజేంద్ర సింగ్ రావత్ (తండ్రి) దేవకీ దేవి (తల్లి) | ||
సంతానం | అనుపమా రావత్[1] | ||
పూర్వ విద్యార్థి | లక్నో యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హరీష్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 7వ ముఖ్యమంత్రిగా, 15వ లోక్‌సభలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
హరీష్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లా, మోహన్రి గ్రామంలో 1948 ఏప్రిల్ 27న రాజేంద్ర సింగ్ రావత్, దేవకీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశాడు.
హరీష్ రావత్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై 2014లో ఉత్తరాఖండ్ 7వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. తరువాత 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో 25 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత రావత్ 2016 ఏప్రిల్ 21 నుండి 2016 ఏప్రిల్ 22 వరకు ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రికార్డు నెలకొల్పాడు. హరీష్ రావత్ 19 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత తిరిగి 2016 మే 11న 3వ సారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం 2017 మార్చి 18 వరకు భాద్యతలు నిర్వహించాడు. ఆయన పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా కూడా పని చేశాడు. హరీశ్ రావత్ 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో లాల్కువాన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ చేతిలో 16వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓటింగ్ శాతం | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓటింగ్ శాతం | ఇతర |
---|---|---|---|---|---|---|---|
1980 | అల్మోరా | గెలుపు | 46.31% | మురళీ మనోహర్ జోషి | జనతా పార్టీ | 21.27% | |
1984 | అల్మోరా | గెలుపు | 61.26% | మురళీ మనోహర్ జోషి | బీజేపీ | 14.79% | |
1989 | అల్మోరా | గెలుపు | 42.45% | కాశీ సింగ్ ఐరీ | ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ | 39.39% | |
1991 | అల్మోరా | ఓటమి | 37% | జీవన్ శర్మ | బీజేపీ | 45.94% | |
1996 | అల్మోరా | ఓటమి | 26.59% | బాచి సింగ్ రావత్ | బీజేపీ | 41.05% | |
1998 | అల్మోరా | ఓటమి | 33.60% | బాచి సింగ్ రావత్ | బీజేపీ | 52.39% | |
1999 | అల్మోరా | ఓటమి | 45.50% | బాచి సింగ్ రావత్ | బీజేపీ | 48.39% | |
2009 | హరిద్వార్ | గెలుపు | 42.16% | స్వామి యతినిద్రానంద్ గిరి | బీజేపీ | 25.99% | |
2019 | నైనిటాల్ – ఉధంసింగ్ నగర్ | ఓటమి | 34.41% | అజయ్ భట్ | బీజేపీ | 61.65% | [3] |
సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓటింగ్ శాతం | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓటింగ్ శాతం | ఇతర |
---|---|---|---|---|---|---|---|
2012 ఉప ఎన్నిక | దార్చుల | గెలుపు | 72.83% | విష్ణు దత్ | భారతీయ జనతా పార్టీ | 24.75% | [4] |
2017 | హరిద్వార్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం | ఓటమి | 33.28% | యతీశ్వరానంద్ | భారతీయ జనతా పార్టీ | 45.78% | |
2017 | కిచ్చా | ఓటమి | 43.66% | రాజేష్ శుక్ల | భారతీయ జనతా పార్టీ | 45.77% | [5] |
2022 | లాల్కువాన్ | ఓటమి | మోహన్ సింగ్ బిష్త్ | భారతీయ జనతా పార్టీ | [6] |