హార్ట్‌బీట్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ద్వారక రాజా |
రచన | ద్వారక రాజా |
కథ | ద్వారక రాజా |
నిర్మాత | శ్యామ్ దేవాభక్తుని |
తారాగణం | ధృవ వెన్బా |
ఛాయాగ్రహణం | బాలాజీ సుబ్రహ్మణ్యం |
కూర్పు | మునియెజ్ |
సంగీతం | ధరన్ కుమార్ |
నిర్మాణ సంస్థ | దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 19 జనవరి 2018 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
హార్ట్‌బీట్ 2017లో విడుదలైన తెలుగు సినిమా. దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్యామ్ దేవాభక్తుని నిర్మించిన ఈ సినిమాకు ద్వారక్ రాజా దర్శకత్వం వహించాడు.[1] తమిళంలో 2017లో విడుదలైన “కాదల్ కసకుతయా” సినిమాను “హార్ట్ బీట్” పేరుతో తెలుగులోకి అనువదించారు. ధృవ, వెన్బా, చార్లీ, కల్పన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 15న విడుదల చేసి, సినిమాను 19 జనవరి 2018న విడుదల చేశారు.[2]
17 ఏళ్లు ఉన్న దివ్య ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కానీ ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 25 ఏళ్ల అర్జున్‌ను ప్రేమించింది. ఇద్దరి మధ్య వయసు అంతరం ఉన్న పర్వాలేదు అనుకున్న దివ్య, తన ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, చివరికి దివ్య ప్రేమ గెలిచిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "అద్దాల మేడలో" | 4:42 | |
2. | "హలో అర్జున్" | హరిణి | 4:14 |
3. | "నీ కలలతోటలో" | 4:42 | |
4. | "ఆనందమే" | 1:20 | |
5. | "హార్ట్‌బీట్ థీమ్" | — | 2:31 |
6. | "లవ్ ఇస్ లైఫ్ థీమ్" | — | 1:49 |