హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)[1] (ఆంగ్లం: ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్), సంక్షిప్తంగా హెచ్.ఏ.ఎం (ఎస్) బీహార్‌లో రాజకీయ పార్టీ. ఈ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) మాదిరిగానే ఎన్డీఏకి సహజ మిత్రపక్షంగా ఉంది. ఇది 2020లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల గుర్తు వోక్ని అందుకుంది.[2]
2015 బీహార్ రాజకీయ సంక్షోభం తరువాత హిందుస్తానీ అవామ్ మోర్చా ఏర్పాటుకు 18 మందితో కలిసి జనతాదళ్ (యునైటెడ్) పార్టీని విడిచిపెట్టిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ దీనిని 2015 మే 8న అధికారికంగా ప్రారంభించాడు.[3][4] పార్టీ 2015 జూన్‌లో దాని పేరుకు "సెక్యులర్"ని జోడించి, హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)గా మారింది.[5][6] జూలై 2015లో ఎన్నికల సంఘం హెచ్.ఏ.ఎం (ఎస్) ని రాజకీయ పార్టీగా గుర్తించింది.[7] పార్టీ ఎన్నికల గుర్తు వోక్.[8][9][10][11]
జూలై 2015లో, పార్టీ ఎన్డీఏలో చేరి 21 స్థానాల్లో పోటీ చేసింది, బీహార్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టిక్కెట్‌పై కొంతమంది అదనపు సభ్యులు పోటీ చేశారు. 18 సెప్టెంబర్ 2015న హెచ్.ఏ.ఎం (ఎస్) తన 13 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది,[12] మాంఝీ మఖ్దుంపూర్, ఇమామ్‌గంజ్ నుండి పోటీ చేశాడు.[13][14]
మునుపటి ఎన్నికల్లో ఈ కూటమికి మూడు చిన్న మిత్రపక్షాలు లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హెచ్.ఏ.ఎం (ఎస్)తో కలిసి బీజేపీ నాయకత్వం వహించగా, జనతాదళ్ (యునైటెడ్)మహాఘటబంధన్ ప్రతిపక్ష పార్టీలో భాగంగా పోటీ చేసింది.[16][17] 2017లో జనతాదళ్ (యునైటెడ్) విధేయతను మార్చుకుంది దీని వలన మహాగత్బంధన్ ప్రభుత్వం రద్దు చేయబడింది, ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.[18] హెచ్.ఏ.ఎం (ఎస్), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూటమిని విడిచిపెట్టాయి.[19][20]
ఆగస్టు 2020లో ప్రచార దశలో కూటమి తిరిగి ఎన్డీఏలో చేరింది.[21] 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో పార్టీ నాలుగు సీట్లు గెలిచి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా చేశాడు.[22][23]