మీనాక్షిపురం మత మార్పిడుల నేపథ్యంలో రామగోపాలన్ 1980 లో హిందూ మున్నాని స్థాపించారు. ఇది హిందువుల హక్కుల కోసం పనిచేస్తూ, మత మార్పిడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.[1][2][3][4][5]
దక్షిణ భారతదేశానికి చెందిన ఇషాతుల్ ఇస్లాం సభ చేపట్టిన మీనాక్షిపురం మతమార్పిడులను వ్యతిరేకిస్తూ 1982 లో రామనాథపురం జిల్లాలోని హిందూ జనాభాను సమీకరించడం ప్రారంభించి, హిందూ మున్నాని మొదటిసారిగా ప్రజలకు పరిచయం అయింది . అప్పటి నుండి, హిందూ మున్నాని తరచుగా హిందువులకు అండగా నిలుస్తుంది.
హిందూ మున్నాని తమిళనాడులో వినయక చతుర్థి ఉత్సవాలను నిర్వహిస్తుంది. 16 మే 2006 న, హిందూ మున్నాని వెల్లూరులోని జలకాంతేశ్వర ఆలయంలో శివలింగ స్థాపనకు సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించింది.[4][7][8][9][10][11][12]