హిమాన్షు ప్రభా రే (జననం 1947 ఆగస్టు 15) సంస్కృత పండితురాలు, చరిత్రకారిణి, పురావస్తు శాస్త్రవేత్త. సముద్ర పురావస్తు శాస్త్రం, చరిత్ర దక్షిణాసియా సంస్కృతి ఆమె అభిరుచులు. డిస్టెంట్ వరల్డ్స్ ప్రోగ్రామ్‌తో సహకార పరిశోధన కోసం హంబోల్ట్ ఫౌండేషన్ వారి అన్నెలీస్ మేయర్ పరిశోధన అవార్డు గ్రహీత. జర్మనీలోని మ్యూనిచ్‌లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయంలోని డిస్టెంట్ వరల్డ్స్ ప్రోగ్రాంలో గౌరవ ఆచార్యులు. ఆమె న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిస్టారికల్ స్టడీస్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసింది. 2015 వరకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసింది.
ఆమె చరిత్ర, ప్రపంచ వారసత్వం, పురావస్తు శాస్త్రంపై అనేక పుస్తకాలు, పరిశోధనా పత్రాలను రచించింది. వివిధ పరిశోధనా సంస్థల నుండి అనేక అవార్డులను అందుకున్నారు.[1][2]
చాలా మంది చరిత్రకారులు మధ్యయుగ దక్షిణాసియా రాజకీయ రాజవంశాలపై దృష్టి సారించి, సముద్ర చరిత్రను విస్మరించారని ప్రభ అంటుంది. ఆమె తన తాజా ప్రాజెక్టులో గోవా నుండి మంగళూరు వరకు భారతీయ తీరప్రాంతంపై దృష్టి సారించింది. దీనిలో ఆమె యూరోపియన్ కాలం నాటి చారిత్రక స్మారక చిహ్నాల ద్వారా సముద్ర చరిత్రను అధ్యయనం చేయాలని భావించింది. తీర ప్రాంత చరిత్రను భారతదేశ చరిత్రగా మాత్రమే విడదీయరాదని, ఇది మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని కవర్ చేసే అధ్యయనం లాగా చేయాలని ఆమె అంటుంది. పతనమౌతున్న తీర ప్రాంత వారసత్వాన్ని కాపాడేందుకు, "మనం నిశితమైన పరిశోధనల ద్వారా, చరిత్ర, పురావస్తు శాస్త్రం, వారసత్వాలను, ముఖ్యంగా ప్రపంచ వారసత్వాన్ని కలపాలి" అని వ్యాఖ్యానించింది.[3]
హిమాన్షు ప్రభా రే రచించిన అనేక పుస్తకాలలో, ఈ క్రిందివి ఆమె రచనలలో కొన్ని: