హీథర్ క్లేర్ నైట్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన ఒక ఇంగ్లీష్ క్రికెట్ క్రీడాకారిణి. ఇంగ్లాండ్, రోచ్‌డేల్ ప్రాంతంలో 1990 డిసెంబరు 26న జన్మించింది. డెవాన్‌లోని ప్లైమౌత్‌లోని రాష్ట్ర సెకండరీ పాఠశాల అయిన ప్లిమ్‌స్టాక్ పాఠశాలలో చదువుకుంది.[1] ఆమెకు ప్రకృతి (నాచురల్) శాస్త్రాలను అభ్యసించడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కలిపించారు. కానీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు సమయం కోసం దానిని తిరస్కరించింది.[2] ఆమె కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో జీవ వైద్య శాస్త్రాలను (బయోమెడికల్ సైన్సెస్) అభ్యసించింది.[3]
నైట్ మారుపేరు "ట్రెవ్". 2015లో ఆమె క్రీడా పాత్రికేయుడు (స్పోర్ట్స్ జర్నలిస్ట్) క్లేర్ బాల్డింగ్‌కి తన మారు పేరు గురించి చెపుతూ, "నాకు దాదాపు 13 ఏళ్లు ఉన్నప్పుడు క్రికెట్ శిబిరంలో పరిచయం చేసుకున్నప్పుడు, నేను హీథర్ అని కాకుండా ట్రెవర్ అని చెప్పానని వారు అనుకున్నారు!" అని వివరించింది [4]
ఆమె కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేది. నైట్ 2019 డిసెంబరులో ఇంగ్లాండ్ తరపున తన 100వ మహిళల ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.
నైట్ 'డెవాన్ క్రికెట్ లీగ్'లో ప్లైమ్‌స్టాక్ క్రికెట్ క్లబ్ తరపున క్రికెట్ ఆడింది.[5] ఆమె 8 సంవత్సరాల వయస్సులో 'కోల్ట్స్' శిక్షణా తరగతులకు హాజరు కావడం ప్రారంభించి, ఆ క్లబ్ వ్యవస్థలో యువతగా ఎదిగింది.
నైట్ 'కౌంటీ' స్థాయిలో శక్తివంతమైన బ్యాటర్. ప్రారంభంలో ఆమె సొంత కౌంటీ అయిన డెవాన్ కోసం ఆడింది, ప్రస్తుతం బెర్క్‌షైర్ కోసం ఆడుతోంది. ఆమె 2008 లో 390 పరుగులు, 2009 లో 622 పరుగులతో రెండు కౌంటీ లోనూ అగ్రస్థానంలో ఉంది. ఆమె సూపర్ ఫోర్స్‌లో డైమండ్స్, సఫైర్స్, ఎమరాల్డ్స్ తరపున కూడా ఆడింది.
నైట్ (ప్రస్తుతం నిలిచిపోయిన)మహిళా క్రికెట్ సూపర్ లీగ్‌లో 'వెస్ట్రన్ స్టార్మ్'కు నాయకత్వం వహించి, 2017, 2019 సంవత్సరాలలో టైటిల్ సాధించింది.[6][7] నాలుగు సీజన్ల పోటీలో ఆమె అత్యధిక పరుగులు తీసిన క్రీడాకారిణి.[8] ఆమె 2020లో 'రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ'లో 'వెస్ట్రన్ స్టార్మ్' తరపున ఆడటం కొనసాగించింది.[9]
నైట్ దేశీయ స్థాయిలో ఆస్ట్రేలియాలో, గతంలో 'టాస్మానియన్ రోర్', 'హోబర్ట్ హరికేన్స్' తరపున, ఇంకా 'సిడ్నీ థండర్' కొరకు ఆడింది. ఆమె తన మొదటి సీజన్‌లో 'మహిళా బిగ్ బాష్ లీగ్'ని 'సిడ్నీ థండర్' జట్టు నుంచి గెలుచుకుంది, ఆఖరి రోజు ఆటలో 26*తో అధిక పరుగులు చేసింది.[10] 2021లో, ' ది హండ్రెడ్ ప్రారంభ సీజన్ కోసం లండన్ స్పిరిట్ ఆమె గురించి అనుకున్నారు.[11] 2022 ఏప్రిల్లో, 'ది హండ్రెడ్' సీజన్ కోసం ఆమెను 'లండన్ స్పిరిట్' ఎంపిక చేసింది.[12]
2023లో 'మహిళల ప్రీమియర్ లీగ్' ప్రారంభ సీజన్‌లో, నైట్‌ను 40 లక్షల ధరకు 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)' ఆమెను ఎంపిక చేసింది.[13]
గాయపడిన 'సారా టేలర్'కు బదులుగా 2010లో భారత పర్యటన కోసం నైట్ ను ఇంగ్లండ్ జట్టులోకి పిలిపించారు. 5వ ఒక రోజు అంతర్జాతీయ పోటీలో మార్చి 1న ముంబైలో ఆడింది, బ్యాటింగ్ ప్రారంభించి ఆమె అంతర్జాతీయ పోటీలో 49 పరుగులు చేసింది.[14] ఆమె 2010లో ఇంగ్లండ్ జట్టు తరపున శ్రీలంకలో పర్యటించింది. నవంబరు 22న కొలంబోలో జరిగిన సిరీస్‌లోని 2వ మ్యాచ్‌తో ఆమె ట్వంటీ20 పోటీలను ఆడడము మొదలు పెట్టింది.[15] 2011 జనవరిలో సిడ్నీ బ్యాంక్‌స్టౌన్ ఓవల్' లో జరిగిన 'యాషెస్ టెస్ట్' లో ఆమె మొదటగా ఆడింది.
2014 ఏప్రిల్లో మహిళా క్రీడాకారుల కోసం ప్రకటించిన 18 ECB సెంట్రల్ కాంట్రాక్టుల మొదటి విడత జాబితాలో ఆమె పేరు నమోదు అయింది.[16]
2016 జూన్ 5న, 'షార్లెట్ ఎడ్వర్డ్స్' వైదొలిగిన తర్వాత నైట్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించింది.[17]
ఒక రోజు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో యాభై పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె పేరు నిలచింది.[18]
హీథర్ నైట్ తన మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించింది. ఈ జట్టు మొదటి (ఓపెనింగ్) మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయినప్పటికీ టోర్నమెంట్ గెలుచుకున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఆమె, నటాలీ స్కివర్‌తో కలిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (213) [19] లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ ని 107 పరుగులతో ఓడించింది. చరిత్రలో రికార్డు స్థాయిలో 3వ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.[20]లార్డ్స్లో జరిగిన చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించడానికి నైట్ దోహదపడింది.[21][22][23] జట్టు విజయం తర్వాత, ఆమెకు 'క్వీన్స్ 2018' న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో OBE (Order of the British Empire) లభించింది.[24]
2018 ఏప్రిల్లో జరిగిన మ్యాచ్ లో ఆమె 2017 ప్రపంచ కప్ విజయంతో ఐదుగురు విస్ డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికైంది.[25]
2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన ICC మహిళల ప్రపంచ ట్వంటీ20 టోర్నమెంట్‌కు ఆమె ఇంగ్లాండ్ జట్టుకు నాయకురాలిగా ఎంపికైంది.[26][27]
2019 ఫిబ్రవరిలో, ఆమెకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) తరపున ఆడటానికి పూర్తి కేంద్ర కాంట్రాక్టును అందచేసింది.[28][29] 2019 జూన్లో, ECB మహిళల యాషెస్‌లో పోటీ చేయడానికి ఆస్ట్రేలియాతో తమ ప్రారంభ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఆమెను ఎంపిక చేసింది.[30][31]
2019 డిసెంబరు 12న, మలేషియాలో పాకిస్థాన్‌తో జరిగిన ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా, నైట్ ఇంగ్లండ్ తరపున 100 WODI మ్యాచ్‌లు ఆడిన పదవ మహిళగా అవతరించింది.[32]
2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే ICC మహిళల, T20 ప్రపంచ కప్‌కు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా నైట్ ఎంపిక అయింది..[33] టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ తమ రెండవ మ్యాచ్‌లో, థాయ్‌లాండ్‌తో జరిగిన WT20Iలలో నైట్ తన 1,000వ పరుగును సాధించింది.[34] ఆమె WT20I క్రికెట్‌లో తన మొదటి శతకాన్ని సాధించింది.[35] మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో శతకాలను చేసిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపబడింది.[36]
2020 జూన్ 18న, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మహిళల మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 24 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో నైట్‌ని ఎంపిక చేశారు.[37][38] 2021 జూన్లో, భారత్‌తో జరిగే వన్-ఆఫ్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు నైట్ కెప్టెన్‌గా ఎంపిక అయింది..[39][40] 2021 జూలై 3న, భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో, నైట్ తన 3,000వ పరుగును సాధించి WODI క్రికెట్‌లో 50వ వికెట్‌ను తీసింది.[41][42] 2021 డిసెంబరులో, 'మహిళల యాషెస్'లో పోటీ చేసేందుకు ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా నైట్ ఎంపికయింది.[43] 2022 ఫిబ్రవరిలో, ఆమె న్యూజిలాండ్‌లో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[44] 2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[45]