హీరో | |
---|---|
దర్శకత్వం | జి. వి. సుధాకర్ నాయుడు |
స్క్రీన్ ప్లే | జి. వి. సుధాకర్ నాయుడు |
కథ | గోపి మోహన్ రవి జి. వి. సుధాకర్ నాయుడు |
నిర్మాత | మన్యం రమేష్ |
తారాగణం | నితిన్ భావన రమ్యకృష్ణ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం నాగేంద్రబాబు |
ఛాయాగ్రహణం | రాం ప్రసాద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | మన్యం ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 24 అక్టోబరు 2008 |
సినిమా నిడివి | 146 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హీరో 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా.[1] మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో జి. వి. సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, భావన, రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాగేంద్రబాబు తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2][3][4] ఇది మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం మలయాళంలో పోలీస్ అకాడమీగా, హిందీలో లాడెంగే హమ్ మార్టే దమ్ తక్ (2011) పేర్లతో అనువాదం చేయబడింది.
నాగేంద్ర నాయుడు (నాగేంద్ర బాబు) ధైర్యవంతుడైన పోలీసు అధికారి. అతను తన కొడుకు రాధాకృష్ణ (నితిన్) ను కూడా మంచి పోలీసు అధికారిగా చూడాలనుకుంటున్నాడు. తన కొడుకు మాఫియా డాన్ ల అంతంచూస్తే,తన చేతులతో కొడుకుకి రాష్ట్ర ప్రభుత్వ పతకాన్ని అందించాలని కలలు కంటుంటాడు. అయితే, అతని భార్య సరళ (కోవై సరళ) తన కొడుకును సూపర్ స్టార్‌గా చూడాలనుకుంటుంది. అంతలోనే నిజాయితీపరుడు ఎవరైనా పోలీసు ఉద్యోగానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోని ప్రవేశపెడుతుంది. సినీ హీరోకి అవసరమైన శిక్షణ అంతా కేవలం మూడు నెలల వ్యవధిలో పోలీస్ అకాడమీలో నేర్చుకోవచ్చని నాగేంద్ర నాయుడు తన భార్యను ఒప్పించడంతో, కొడుకు పోలీస్ అకాడమీలో చేరడానికి సరళ అంగీకరిస్తుంది. పోలీసు అకాడమీలో చేరిన రాధాకృష్ణ అక్కడ కృష్ణవేణి (భావన) తో ప్రేమలో పడతాడు. కృష్ణవేణి కూడా రాధాకృష్ణని ప్రేమిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణవేణి పెద్ద నక్సలైట్ నాయకురాలిని చెప్పి ఆమె ఫోటో టీవీలో కనిపిస్తుంది. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. కృష్ణవేణి నక్సలైట్ గా ఆరోపణ చేయబడిందా,లేదా ఆమె నిజంగా నక్సలైటా? రాధాకృష్ణ, కృష్ణవేణిల మధ్య ప్రేమ ఏమవుతుంది? తన తండ్రి నాగేంద్ర నాయుడు కలను రాధాకృష్ణ ఎంతవరకు నెరవేర్చగలిగాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సినిమా రెండవ భాగంలో తెలుస్తాయి.
Untitled | |
---|---|
మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[5]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "సై కుర్రాడే (రచన: అనంత శ్రీరామ్)" | రాహుల్ నంబియార్, రీటా త్యాగరాజన్ | 04:27 | ||||||
2. | "కన్నుల్లోనా (రచన: అనంత శ్రీరామ్)" | హరిచరణ్, ప్రియా హిమేష్ | 04:43 | ||||||
3. | "యాహూ యాహూ (రచన: అనంత శ్రీరామ్)" | కార్తీక్, జై | 04:19 | ||||||
4. | "కా కలవ్యే (రచన: అనంత శ్రీరామ్)" | రంజిత్, రీటా | 04:30 | ||||||
5. | "నా వయసే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | హేమచంద్ర, గీతా మాధురి | 04:30 | ||||||
6. | "కన్నుల్లోనా (రచన: అనంత శ్రీరామ్)" (రిపీట్) | హరిచరణ్, ప్రియ | 04:43 | ||||||
27:14 |
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]