వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1981 జనవరి 24|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||
బంధువులు | ఇమ్రాన్ ఫర్హత్ (సోదరుడు) | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 168) | 2001 మార్చి 27 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 136) | 2001 మార్చి 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 మార్చి 20 - శ్రీలంక తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4 |
హుమాయున్ ఫర్హత్ (జననం 1981, జనవరి 24) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 2001లో తన ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ఆడాడు. పాకిస్తాన్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఇద్దరు సోదరులలో ఇతను ఒకడు.
ఇతని సోదరుడు ఇమ్రాన్ ఫర్హాత్ కూడా పాకిస్థాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.[1][2]
ఇతను ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2001 మార్చిలో పాకిస్తాన్ తరపున న్యూజిలాండ్ తో ఐదు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో ఒక్క ఔట్ కూడా నమోదు చేయని ఏకైక వికెట్‌కీపర్ గా ఉన్నాడు.[3]
2007లో, లాహోర్ బాద్షాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అనధికారిక ఇండియన్ క్రికెట్ లీగ్ లో పాల్గొన్నాడు.[4] అందులో పాల్గొనడం వలన పాకిస్తాన్ జట్టు నుండి జీవితకాలం నిషేధించబడ్డాడు.[5] 2000ల చివరలో కమ్రాన్ అక్మల్ ఫస్ట్-ఛాయిస్ వికెట్-కీపర్‌గా ఎదగడంతో జాతీయ జట్టుకి ఇతను ఎంపికకాలేదు.
వందకు పైగా లిస్ట్ ఎ, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన హుమాయున్ ఫర్హత్, 2014–15 సీజన్ తర్వాత దేశవాళీ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[6]
2021 ఆగస్టులో, 2021-22 దేశీయ సీజన్ కోసం, సెంట్రల్ పంజాబ్ మొదటి XI జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. అండర్-19, అండర్-16 స్క్వాడ్‌లకు కూడా ప్రధాన కోచ్‌గా కూడా నియమించబడ్డాడు.[7] 2022 నవంబరులో, పిసిబితో 3 స్థాయిల కోచింగ్ కోర్సులను చేపట్టడం ప్రారంభించాడు.[8]