Hushang Mirza | |||||
---|---|---|---|---|---|
Shahzada of the Mughal Empire | |||||
జననం | March 1604 Burhanpur, Mughal Empire | ||||
మరణం | 1628 ఫిబ్రవరి 2 Lahore, Mughal Empire | (వయసు 23)||||
Spouse | Hoshmand Banu Begum | ||||
| |||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Daniyal Mirza | ||||
తల్లి | Princess of Bhojpur |
హుషాంగు మీర్జా (హోషాంగు మీర్జా) (పర్షియా: هوشنگ March; మార్చి 1604 – 2 ఫిబ్రవరి 1628) మొఘలు యువరాజు, మూడవ మొఘలు చక్రవర్తి అక్బరు మనవడు. ఆయన డేనియలు మీర్జా చిన్న కుమారుడు. నాల్గవ మొఘలు చక్రవర్తి జహంగీరు అల్లుడు.
1012 ఏ.హెచ్. 1604 మార్చి ప్రారంభంలో జన్మించిన ఆయనకు ఆయన తండ్రి తాత అక్బరు చేత ఫర్హాంగు హుషాంగు అనే పేరు పెట్టారు.[1]ఆయన డేనియలు మీర్జా చిన్న కుమారుడు. డేనియలు మీర్జా హిందూ భార్య, భోజ్పూరు పరమరా యువరాణి ( కుమార్తె మహి బాను బేగం)కి జన్మించిన ఇద్దరు పిల్లలలో ఒకరు.[2][3]
ఆయన తల్లిదండ్రుల వివాహం ఖచ్చితమైన పరిస్థితులు నమోదు చేయబడనప్పటికీ ఆయన తాత (తల్లికి తంట్ది) రాజా దల్పతు ఉజ్జైనియా 1599 లో మొఘలు అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అలహాబాదు సుబాదారు అయిన డేనియలు మీర్జా తిరుగుబాటును తటస్థీకరించడానికి పంపబడ్డాడు. యువరాజు రాకతో దల్పతు త్వరగా లొంగిపోయి ఏనుగులను నివాళి అర్పించాడు.[4] ఈ సమయంలోనే రాజా తన కుమార్తెను డేనియలుకి ఇచ్చి వివాహం చేసాడని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సంవత్సరాల తరువాత దల్పతు చంపబడ్డాడు. అప్పటి రాకుమారుడు సలీం (తరువాత జహంగీరు చక్రవర్తి అయ్యాడు) ఆదేశాల మేరకు మొఘలు అధికారి తన సంక్షిప్త తిరుగుబాటుకు ప్రతీకారంగా చంపబడ్డాడని భావించారు.[5]
1605 లో ఏప్రెలులో హుషాంగు జన్మించిన ఒక సంవత్సరం తరువాత, డేనియలు మీర్జా మతిమరుపు ట్రెమెంసుతో మరణించాడు. అదే సమయంలో దక్కను సుబేదారుగా వ్యవహరించాడు. తన చిన్న కొడుకు మరణంతో తీవ్రంగా ప్రభావితమైన అక్బరు అదే సంవత్సరం అక్టోబరులో కన్నుమూశాడు.[6] ఆయన మరణం తరువాత డేనియలు కుటుంబం ఆయన ప్తతినిధిగా పనిచేస్తున్న భూబాగానికి రాజధాని బుర్హాన్పూర్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 1606 లో ఇక్కడి నుండి వారిని జహంగీరు వైద్యుడు ముఖర్రాబు ఖాను మొఘలు రాజసభకు తీసుకెళ్లారు.[7][8] జహంగీరు తన ఆత్మకథ అయిన తుజుకు-ఎ-జహంగీరిలో తన సోదరుడి పిల్లల రాకను నమోదు చేశాడు:[9]
ముకార్రాబు ఖాను తీసుకువచ్చిన డేనియలు పిల్లలను నేను చూశాను; ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బాలురు పేర్లు తహ్మురాసు, బేసున్ఘరు, హుషాంగు. ఇలాంటి దయ, ఆప్యాయత ఈ పిల్లలకు నేను చూపించాను. పెద్దవాడైన తహ్మురాసు ఎల్లప్పుడూ పర్యవేక్షణలో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఇతరులను నా స్వంత సోదరీమణుల బాధ్యతలకు అప్పగించాను.
జహంగీరు పాలన ప్రారంభం నాటికి జెసూటు మిషనరీలు భారతదేశంలో అనేక దశాబ్దాలుగా ఉన్నారు. ఇది క్రైస్తవ మతం వ్యాప్తిలో క్రమంగా పురోగతి సాధించబడింది. ఆగ్రా, లాహోర్లలో మతమార్పిడుల సంఘాలు చిన్నవైనప్పటికీ తీవ్రంగా పనిచేస్తున్న ఉన్నాయి. జహంగీరు తన తండ్రి కంటే మిషనరీలకు స్నేహపూర్వకంగా కనబడ్డాడు కాబట్టి ఆయన కూడా మతం మార్చుకుంటాడని ఆశలు కూడా ఉన్నాయి.[10][11]
1610 జూలైలో జహంగీర్ ఇద్దరు జెస్యూటు పూజారులు, ఫాదర్లు జెరోం జేవియరు, ఇమ్మాన్యుయేలు పిన్హీరోలను ఆగ్రాలోని తన కోర్టుకు పిలిచారు.[12] అక్కడ తన ప్రభువుల సమావేశానికి ముందు జహంగీరు హుషాంగు, ఆయన ఇద్దరు సోదరులను బాప్టిజం పొందటానికి, క్రైస్తవులుగా పెంచడానికి జెస్యూట్లకు అప్పగించాడు. పూజారులు చాలా ఆనందించి మోకాళ్ళ మీద పడి చక్రవర్తి పాదాలకు ముద్దు పెట్టారు.[13]
కోర్టుకు హాజరైన ఈస్టు ఇండియా కంపెనీ ప్రతినిధి సర్ విలియం హాకిన్సు ముస్లిం ప్రభువులలో తన మేనల్లుళ్ళ మద్దతును తగ్గించడానికి జహంగీరు మతమార్పిడికి అనుమతి ఇచ్చారని నమ్మాడు. ఇది తన సంతానం సింహాసనం మీద వారసత్వంగా సంక్లిష్టతను నివారించడానికి ఇది సహకరించిందని భావిస్తున్నారు.[14] ప్రత్యామ్నాయంగా భారతదేశంలో మొదటి జేమ్సు రాయబారి సర్ థామసు రో, జహంగీరు పోర్చుగీసు భార్యను పొందగలగడానికి అవకాశం కలిగినట్లు పేర్కొన్నారు.[15]
ఏదేమైనా మూడు నెలల తయారీ తరువాత రాకుమారులు బాప్టిజం కోసం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.[13] హుషాంగు, ఆయన అన్నలు, తహ్మురాసు, బేసున్ఘరు, నాల్గవ యువరాజు, అక్బరు సోదరుడి మనవడు, మీర్జా ముహమ్మదు హకీం ఆగ్రా గుండా మెరిసే ఊరేగింపులో నగరంలోని క్రైస్తవులు నాయకత్వం వహించిన కోట నుండి అక్బరు చర్చి వరకు వెళ్ళారు.[16] రాజకుమారులు విలాసవంతమైన కాపరిసను ఏనుగుల మీద ప్రయాణించారు. పోర్చుగీసు ప్రభువుల వలె బంగారు శిలువల మెడలో వేలాడదీశారు. వారు ప్రవేశించగానే చర్చి గంటలు మోగుతున్నాయి. కొవ్వొత్తులను పట్టుకొని, సుగంధ ద్రవ్యాల మేఘాల గుండా నడిచారు. పర్షియా భాషలో పూజారి చెప్పిన బాప్టిజం ప్రతిజ్ఞను వారు పునరావృతం చేశారు బాప్టిస్మలు నీటిని వారి తలపై చల్లుకున్నారు.[13] చివరికి వారికి పోర్చుగీసు పేర్లు ఇవ్వబడ్డాయి. హుషాంగు పేరు డాను హెన్రికోగా మార్చబడింది. తహ్మురాసు పేరు బేసున్ఘరు, నాల్గవ యువరాజులకు వరుసగా డాను ఫిలిపు, డాను కార్లో, డాను డువార్టే పేర్లు ఇవ్వబడ్డాయి.[16]
అయితే ఈ మార్పిడులు తాత్కాలికమే. నాలుగు సంవత్సరాల తరువాత (బహుశా జహంగీరు వారసత్వ భయాలు తొలగించబడిన తరువాత) యువరాజులు ముస్లిం మతంలోకి తిరిగి వచ్చారు. జెస్యూట్లు వారు "కాంతిని తిరస్కరించారు, వారి వాంతికి తిరిగి వచ్చారు" అని తీవ్రంగా విమర్శ చేశారు.[16][17]
1620 లో జరిగిన మొఘలు వారసత్వ యుద్ధంలో హుషాంగు, ఆయన సోదరుడు తహ్మురాసు, జహంగీరు అంధుడైన పెద్ద కుమారుడు ఖుస్రావుకు సహకరించాడు.[18][19]ఏదేమైనా 1625 లో హుషాంగు షాజహాను అదుపు నుండి తప్పించుకున్నాడు. తరువాతి యువరాజు చక్రవర్తి మీద తిరుగుబాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నాడు. షాజహాను, ఆయన మిత్రుడు, మాలికు అంబరు బుర్హాన్పూరు ముట్టడి విఫలమైనప్పుడు హుషాంగు లాహోరులోని మామయ్య రాజసభకు వెళ్ళే ముందు బుండికి చెందిన రావు రత్తను (బుండి) వద్దకు పారిపోయాడు.[20][21]
ఇక్కడ హుషాంగు, తహ్మురాసుతో పాటు (ఇలాంటి పరిస్థితులలో వచ్చినవారు) జహంగీరుకు కప్పం సమర్పించారు. ఆయన ఇద్దరినీ స్వాగతించి తన ఇంటిలో చేర్చుకున్నాడు. దీనికి తోడు జహంగీరు సోదరులను మొఘలు యువరాణితో వివాహం చేసుకోవడం ద్వారా వారిని సత్కరించాడు. తహ్మురాసు జహంగీరు కుమార్తె బహారు బాను బేగాన్ని, హుషాంగు ఆయన మనవరాలు హోష్మండు బాను బేగంను వివాహం చేసుకున్నారు.[21][22]
1627 అకోబరులో జహంగీరు అనారోగ్యంతో మరణించాడు. ఆయన ప్రధాన భార్య నూర్జహాను వెంటనే ఆమెకు ఇష్టమైన జహంగీర్ చిన్న కుమారుడు (అలాగే ఆమె అల్లుడు) షహర్యారు మీర్జాకు మాట పంపారు. షహర్యారు లాహోర్లో తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని, నగరాల ప్రాంతీయ ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు, వారి విధేయతను పొందడానికి సైన్యం, ప్రభువులకు పంపిణీ చేశాడు.[23] హుషాంగు, అతని సోదరులు తహ్మురాసు, బేసున్ఘారు అందరూ యువరాజుకు తమ మద్దతును ప్రకటించారు. బేసున్ఘరును షహర్యారు సుల్తాను సిపా సాలారు (సైన్యాధ్యక్షుడు) గా నియమించారు.[24]
అదే సమయంలో నూర్జహాను సోదరుడు, షాజహానుకు మామగారూ అయిన అసఫ్ఖాను చక్రవర్తి మరణం గురించి తరువాతి (ఇప్పటికీ దక్కన్లో ఉన్నాడు) కు మాట పంపాడు. షాజహాను దక్కను నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన వారసత్వాన్ని కాపాడటానికి, అసఫ్ఖాను దివంగరు ఖుస్రావుమీర్జా కుమారుడు హుషాంగుకు బావమరిది అయిన దావారు బఖ్షి, మధ్యాకాల చక్రవర్తిగా సింహాసనాధిష్టుడిగా చేసాడు.[25] అసఫ్ఖాను తన సైన్యాన్ని లాహోరు వైపు నడిపించినప్పుడు షహర్యారు తన సైన్యాన్ని బేసున్ఘరు ఆధ్వర్యంలో రవి నది మీదుగా వారిని కలవడానికి పంపాడు. అయినప్పటికీ బేసున్ఘరు సైనికులు వారిని వ్యతిరేకించలేకపోయి అతిత్వరితగతిలో ఓడిపోయారు. షహర్యారు లాహోరు కోట వెనక్కి వెళ్ళాడు కాని తన స్వంత మనుష్యులు మోసం చేసి దావారు బఖ్షికి కప్పం సమర్పించారు. లాహోర్లో జరిగిన సంఘటనల గురించి షాజహాను అందుకుని తన రాజ బందీలను ఉరితీయాలని అసఫ్ఖాన్కు ఒక ఆదేశం పంపాడు:[26]
కొడుకు దావారు బఖ్షి (షహ్రియారు) ఉపకరించని సోదరుడు, ఖుస్రావు, రాకుమారుడు డేనియలు కుమారులు అందరినీ ప్రపంచం నుండి పంపించినట్లయితే మంచిది.
మరణశిక్షలు అమలు చేయడానికి షాజహాను రాజబహదూరు అనే హంతకుడిని పంపాడు. 1628 ఫిబ్రవరి 2 రాత్రి హుషాంగు, తహ్మురాసు, షహ్రియారు, దావరు, దావరు తమ్ముడు గార్షాస్పు శిరచ్ఛేదం చేయబడ్డారు (బేసున్ఘరు తుది విధి ప్రస్తావించబడలేదు). ఆ తలలను ఆగ్రాలోని షాజహాను వద్దకు తీసుకువచ్చారు.[27][28]
{{cite book}}
: Unknown parameter |DUPLICATE_page=
ignored (help)