హైదరాబాదు ఏరో క్లబ్, హైదరాబాదు రాజ్యంలోని విమానాశ్రయ క్లబ్. హైదరాబాదు VII నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విమానానికి ఎయిర్‌ఫీల్డ్‌గా ఉండేది. ఈ క్లబ్ 1937లో బేగంపేట విమానాశ్రయంలో మొట్టమొదటి వైమానిక ప్రదర్శనను నిర్వహించింది.[1]
ఈ హైదరాబాదు ఏరో క్లబ్ 1936లో ప్రారంభమైంది. "హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్" ద్వారా 1937లో ఇక్కడ మొదటి ఎయిర్ షో నిర్వహించబడి, 7వ నిజాం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లో విమాన ప్రయాణానికి ఉపయోగపడింది. 1936 నవంబరులో యువరాణి దుర్రుషేవర్ టెర్మినల్ భవనానికి పునాది వేసింది. అప్పుడు హైదరాబాదు ఏరో క్లబ్ ఏర్పడి, నిజాం విమాన ఎయిర్‌ఫీల్డ్‌గా మారింది.[2] 1937లో హైదరాబాద్‌కు పూర్తిస్థాయి విమానాశ్రయం అవసరమని భావించి, విమానాశ్రయ టెర్మినల్ భవనంతో రెండవ విమానాశ్రయం నిర్మించబడింది.[3]