వ్యక్తిగత సమాచారం | |
---|---|
చైర్మన్ | జగన్ మోహన్ రావు అరిశనపల్లి |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1934 |
స్వంత మైదానం | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం |
అధికార వెబ్ సైట్ | hycricket.org |
హైదరాబాదు క్రికెట్ సంఘం (ఆంగ్లం: Hyderabad Cricket Association) అనేది హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, హైదరాబాదు క్రికెట్ జట్టు కార్యకలాపాలకు పాలకమండలి. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా పనిచేస్తుంది. ఇది 1934లో స్థాపించబడింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్వహిస్తుంది, ఇది అంతర్జాతీయ స్థాయి టెస్ట్, ODI, T20 క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది.
2022 సెప్టెంబరు 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలు చేపట్టిన హెచ్‌సీఏకు చేదు అనుభవం ఎదురైంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ల విక్రయ కేంద్రం వద్ద అంచనాలకు మించి అభిమానులు ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాటకు దారితీసింది. 2022 సెప్టెంబరు 22న జరిగిన ఈ ఘటనలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఈ తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని అజారుద్దీన్, హెచ్‌సీఏ నిర్వాహకులపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో అభిమానులు ఫిర్యాదు చేశారు.[1]
2017 డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా కాకా T20 టోర్నమెంట్‌ను నిర్వహించడంతో హెచ్‌సీఏ తెలంగాణ T20 ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించింది.
హైదరాబాదు క్రికెట్ సంఘం తరపున అనేకమంది క్రికెటర్లు ఫస్ట్-క్లాస్, లిస్టు ఎ, ట్వంటీ20 క్రికెట్ లలో మ్యాచ్ లు అడారు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)