హైపూ జడోనాంగ్ | |
---|---|
జననం | 1905 కంభిరాన్ గ్రామం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలోని టమెంగ్‌లాంగ్ జిల్లా) |
మరణం | 1931 ఆగస్టు 29 ఇంఫాల్ |
వృత్తి | ఆధ్యాత్మిక గురువు, రాజకీయ ఉద్యమకారుడు |
హైపూ జడోనాంగ్ (1905-1931) నాగాజాతి సంసృతికి చెందిన ఆధ్యాత్మికవేత్త, రాజకీయ ఉద్యమకారుడు, మణిపూర్ మన్యం వీరుడు. అతను బ్రిటిష్ ఇండియాలోని మణిపూర్ కు చెందినవాడు. అతను సాంప్రదాయలను కాపాడాలని హెరాకా అనే భక్తి ఉద్యమం ఆరంభించాడు. అతను తనకు తాను నాగా జాతివారి "మేషియా కింగ్" గా ప్రకటించుకున్నాడు. తెలుగువారి అల్లూరి సీతారామరాజు లాగానే, నాగాజాతి ప్రజల గుండెల్లో కూడా ఓ మన్యం వీరుడు కొలువై ఉన్నాడు. నాగాజాతి సంసృతి, సాంప్రదాయలు అంటే హైపో జడోనాంగ్ ఎంతో మక్కువ. బ్రిటిష్ రాకతో తమ ఆచారాలు, సాంప్రదాయలు ప్రమాదంలో పడ్డాయని మండిపడేవాడు.
అతను 1905 జూన్ 10న [ఆధారం చూపాలి] కంభిరాన్ గ్రామం (ప్రస్తుతం ఎమెంగ్లాంగ్ జిల్లాలోని నుంగా సబ్-డివిజన్) లో జన్మించాడు. అతని కుటుంబం రోంగ్‌మే నాగా గిరిజన జాతికి చెందినది. అతను తన ముగ్గురు సహోదరులలో చిన్నవాడు. అతనికి యేడాది వయస్సు వచ్చేసరికి అతని తండ్రి తియూదాయ్ మరణించాడు[1]. తన తల్లి తబోలియూ ముగ్గురు కుమారులను తన కుటుంబ ఆస్థి అయిన వ్యవసాయం చేస్తూ పోషించింది.
సాంప్రదాయలను కాపాడాలని హెరాకా అనే భక్తి ఉద్యమం ఆరంభించాడు.అందులో చేరిన వారికి సాంప్రదాయలను బోధించడమే కాదు, వాటిని రక్షించేందుకు ఆయుధ శిక్షణనూ అందించేవాడు.
ప్రమాదకరంగా మారుతున్న జడోనాంగ్ ని బ్రిటిష్ అధికారులు 1939 లో ఉరితీశారు. కానీ ఆ ఉద్యమం ప్రభావాన్ని మాత్రం చెరపలేకపోయారు.