హోజాయ్ జిల్లా | |
---|---|
అసోం రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా ఏర్పాటు | 15 ఆగస్టు 2015 |
ముఖ్య పట్టణం | హోజాయ్ |
తహసీల్ | 3 |
Government | |
• లోక్‌సభ నియోజకవర్గం | నౌగాంగ్ |
• శాసనసభ నియోజకవర్గం | జమునాముఖ్, హోజాయ్, లమ్డింగ్ |
జనాభా (2011) | |
• Total | 9,31,218 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
అధికారిక భాష | బెంగాళీ, అస్సామీ |
ఎక్కువగా మాట్లాడే భాష | సిల్హేటి భాష |
హోజాయ్ జిల్లా, అస్సాంలో నూతనంగా ఏర్పడిన ఒక జిల్లా. ఇది 2015, ఆగస్టు 15న ఏర్పడింది.[1] జిల్లా ప్రధాన కార్యాలయం హోజాయ్ పట్టణంలో ఉంది. నాగావ్ జిల్లాలోని హోజై, డోబోకా, లంక అనే మూడు తహసిల్స్ కలిపి హోజాయ్ జిల్లా ఏర్పడింది. అప్పటి అస్సాం ప్రావిన్స్ అవిభక్త నౌగాంగ్ జిల్లాలో హోజాయ్ (ఇప్పుడు నాగావ్) ఒక భాగంగా ఉండేది.
పురాతన కామరూప చరిత్రలో ఉన్నట్లుగా ప్రస్తుతం హోజాయ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని దావక రాజ్యం లేదా కపిలి వ్యాలీ రాజ్యం అని పిలిచేవారు. చరిత్రకారులు ఈ రాజ్యాన్ని ‘దబక్’, ‘కపిలి’, ‘ట్రైబెగ్’ అని పేర్కొన్నారు. ఈ రాజ్యం సా.శ. 6వ శతాబ్దం వరకు స్వతంత్ర హోదాను పొందింది.[2]
బరాహి పాల రాజవంశ కశ్యప్ (సా.శ. 1365-1400) పాలనలో కపిలి-జమునా లోయలో కాచారి ఆధిపత్యపు కొత్త శకం ప్రారంభమైందని మధ్యయుగ చారిత్రక వర్గాలు పేర్కొన్నాయి. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున బెహాలి ప్రాంతానికి చెందిన రాజు భూమపాల సేవలో కచారి రాజ్యానికి చెందిన మంత్రి బిరోచన, రాజుతో వివాదం తరువాత తన రాజ్యం నుండి పారిపోవలసి వచ్చింది. బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డుకు వచ్చి కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. కచారి పాలన మొత్తం కపిలి-జమునా లోయకు వ్యాపించి, ఆ రాజ్యం కచారిపార్ గా పిలువబడింది.
అహోమ్స్ రాజ్యం విస్తరణ కారణంగా, కచారి రాజులు వారితో విభేదించారు. కచారి రాజు తామ్రాధ్వాజ నారాయణ్ పాలనలో కచారి పాలించిన ప్రాంతాలు స్వర్గాడియో గదధర్ సింఘ ఆధ్వర్యంలో అహోంస్‌కు వెళ్ళాయి. ‘హోజాయ్’ అనే పదం దిమాసాకు చెందినది. దిమాసాలోని అర్చక వర్గాన్ని ‘హోజా’ లేదా ‘హోజైసా’ అని పిలుస్తారు. వారు నివసించిన స్థలాన్ని హోజాయ్ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా హోజాయ్ ప్రాంతంలో దిమాసాస్ జనాభా ఎక్కువగా ఉండగా, వారిలో కొందరు ఇంటిపేరు ‘హోజాయ్’ అని కూడా ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హోజాయ్ జిల్లాలో 9,31,218 జనాభా ఉంది. ఇందులో 4,99,565 (53.65%) మంది ముస్లింలు... 4,24,065 (45.53%) మంది హిందువులు ఉన్నారు.
అప్పటి అస్సాం ప్రావిన్స్ నుండి సిల్హెట్ విభజన తరువాత, అనేకమంది బెంగాలీ హిందువులు అప్పటి తూర్పు పాకిస్తాన్ నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చి ఎక్కువగా లుమ్డింగ్, లంకా (పట్టణం), హోజయ్ వంటి పట్టణాల్లో స్థిరపడ్డారు.
తహసీల్ | మొత్తం జనాభా | హిందువులు | ముస్లింలు | హిందూ % | ముస్లిం % |
---|---|---|---|---|---|
హోజయ్ | 228,530 | 135,377 | 92,590 | 59.24% | 40.52% |
దబాకా | 303,767 | 37,872 | 265,366 | 12.47% | 87.35% |
లంక | 398,921 | 250,816 | 141,609 | 62.87% | 35.50% |
మొత్తం (2011) | 931,218 | 424,065 | 499,565 | 45.53% | 53.65% |
2011 జనాభా లెక్కల ప్రకారం, హోజయ్ పట్టణంలో బెంగాలీ భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సిల్హేటి భాష మాట్లాడతారు. మిగతా వారు అస్సామీ భాష మాట్లాడుతారు.[4]
హోజాయ్ అనేది సాధారణంగా డిమాసా సంఘం ఉపయోగించే ఇంటిపేరు.
హోజాయ్ జిల్లాలో జమునాముఖ్, హోజాయ్, లమ్డింగ్ అనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హోజాయ్ జిల్లా కూడా నౌగాంగ్ నియోజకవర్గంలో భాగంగా ఉంది.