![]() 2021లో అంకిత భకత్ | |||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ | 17 జూన్ 1998||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||
క్రీడ | విలువిద్య (Archery) | ||||||||||||||||||||
ర్యాంకు | 51 (సెప్టెంబరు 2018 నాటికి) | ||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
అంకిత భకత్ (జననం 1998 జూన్ 17) భారతీయ రికర్వ్ ఆర్చర్. ఆమె అక్టోబరు 2023 నాటికి వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ ప్రపంచ 20వ ర్యాంక్‌లో ఉంది.[1] ఆమె భారత జాతీయ రికర్వ్ జట్టులో సభ్యురాలుగా మహిళల వ్యక్తిగత, మహిళల జట్టు, మిక్స్డ్ టీమ్ రికర్వ్ విభాగాలలో అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడుతుంది. ఆమె అర్జెంటీనాలోని రోసారియోలో జరిగిన 2017 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడింది. అక్కడ ఆమె భాగస్వామి జెమ్సన్ సింగ్ నింగ్థౌజమ్తో కలిసి రికర్వ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
2021 ఏప్రిల్ 25న గ్వాటెమాలాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్లో దీపిక కుమారి, కోమలిక బారిలతో కలసి అంకిత భకత్ భారత్ కు స్వర్ణం సాధించింది.[2]
2023లో జరిగిన 2022 ఆసియా క్రీడల్లో ఆర్చరీలో మహిళల టీమ్ విభాగంలో అంకిత భకత్ కాంస్యం గెలిచింది.[3]
అంకిత భకత్ 1998 జూన్ 17న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పాల వ్యాపారి శంతను భకత్, శిలా భకత్లకు జన్మించింది.[4][5]
ఆమె పదేళ్ల వయసులో విలువిద్యపై దృష్టిపెట్టింది. ప్రాథమిక శిక్షణ కోసం ఆమె కలకత్తా ఆర్చరీ క్లబ్లో చేరింది.[6][7] ఆమె 2014లో జంషెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో చేరింది, అక్కడ ఆమె ధర్మేంద్ర తివారీ, పూర్ణిమ మహతో, రామ్ అవదేశ్ల వద్ద శిక్షణ పొందింది.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ట్రయల్స్ లో ఎంపికైన ఆమె యాంక్టన్‌లో జరిగిన 2015 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.[8] అయితే, ఈవెంట్‌కు 35 మంది భారత ప్రతినిధి బృందంలోని 18 మంది అథ్లెట్లు, కోచ్‌లకు అమెరికా వెళ్లడానికి వీసాలు నిరాకరించబడ్డాయి.[9]
సియోల్‌లో సెప్టెంబర్ 3 నుండి 9 వరకు జరిగిన 2015 సియోల్ ఇంటర్నేషనల్ యూత్ ఆర్చరీ ఫెస్టాలో, ఆమె రెండు పతకాలను గెలుచుకున్న జట్టులో ఉంది. అమ్మాయిల వ్యక్తిగత రికర్వ్ పోటీలో కాంస్యం గెలుచుకోగా, బాలికల రికర్వ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించారు.[10]
2024లో పారిస్ లో జరిగిన తన తొలి ఒలింపిక్స్ లో ఈమె మిశ్రమ జట్టు (ధీరజ్ బొమ్మదేవర తో కలిసి) ర్యాంకింగ్ రౌండులో 5వ స్థానంలో నిలిచింది.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)