కళ్ళు చిదంబరం | |
---|---|
![]() | |
జననం | కొల్లూరి చిదంబరం 1945 అక్టోబరు 10 |
మరణం | అక్టోబరు 19, 2015 విశాఖపట్నం | (aged 70)
తల్లిదండ్రులు | కొల్లూరు వెంకట సుబ్బారావు , నాగబాయమ్మ |
కళ్ళు చిదంబరం (అక్టోబర్ 10, 1945 - అక్టోబరు 19, 2015) తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటకరంగంలో నటించి, ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. చిన్న పాత్ర ఐనా దానిద్వారా మంచి గుర్తింపు పొందాడు.[1]
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945, అక్టోబర్ 10 న విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. కళ్లు, అమ్మోరు, చంటి, గోల్మాల్ గోవిందం (1992), మనీ, పెళ్ళిపెందిరి, పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997), ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, గోవిందా గోవిందా, అనగనగా ఒక రోజు, అదిరిందయ్యా చంద్రం, అడవిచుక్క (2000), తొలిపరిచయం, చంటిగాడు (2003), ఐతే ఏంటి (2004), అతడెవరు (2007) తదితర చిత్రాల్లో నటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబరు 19 సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.[2]