This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
గోకుల్‌భాయి దౌలతరం భట్ (జననం: 19 ఫిబ్రవరి 1898 - 6 అక్టోబర్ 1986) హఠల్ (సిరోహి) లో జన్మించాడు. ఇతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. అతను బొంబాయి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, రాచరిక సిరోహి రాష్ట్ర ముఖ్యమంత్రి.[1]
అతను మరో ఏడుగురితో కలిసి 22 జనవరి 1939 న సిరోహిలో ప్రజా మండలాన్ని స్థాపించాడు. సిరోహి నుండి చురుకైన స్వాతంత్ర్య కార్యకర్తలను బ్రిటీష్ వారు కొంతకాలం నిర్బంధించి జైలులో ఉంచారు. స్వాతంత్ర్యానంతరం సిరోహి జిల్లా విభజన, మౌంట్ అబూను గుజరాత్‌కు అప్పగించడాన్ని ఆయన వ్యతిరేకించాడు. దీని ఫలితంగా మౌంట్ అబూ రాజస్థాన్‌లో భాగంగా ఉండిపోయింది, అయితే, జిల్లాలోని కొన్ని ఇతర ప్రాంతాలు గుజరాత్‌కు బదిలీ చేయబడ్డాయి. వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఆయన పోరాడాడు.[2]
ఆయనకు 1971లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 1982లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందుకున్నాడు.[3]
ఎమర్జెన్సీ సమయంలో అతడిని అరెస్టు చేశారు. జైలులో అతను ప్రొఫెసర్ కేదార్, ఉజ్వల అరోరా, భైరోన్ సింగ్ షెకావత్లతో కలిసి సత్యాగ్రహం ప్రారంభించాడు. అతడిని రాజస్థాన్ గాంధీ అని పిలిచేవారు.[4]