చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలానికి చెందిన జనగణన పట్టణం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [1]ఈ మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళుతుంది. మండలం నారాయణపేట డివిజన్లో పరిధిలోని భాగము.మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.
2001 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం 44548 జనాభా ఉంది.10180 కుటుంబాలు.[2] అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.[3]పిన్ కోడ్: 509131.
తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది.
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[5]
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన కురుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.