అట్లూరి పిచ్చేశ్వరరావు | |
---|---|
![]() | |
జననం | |
మరణం | సెప్టెంబరు 26, 1966 | (aged 41)
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త |
జీవిత భాగస్వామి | అట్లూరి చౌదరాణి |
పిల్లలు | అనిల్ అట్లూరి |
తల్లిదండ్రులు |
|
అట్లూరి పిచ్చేశ్వరరావు (1925 ఏప్రిల్ 12 - 1966 సెప్టెంబర్ 26) తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. పిచ్చేశ్వరరావు భారత నౌకాదళంలో మెకానికల్ ఇంజనీరుగా, విశాలాంధ్ర పత్రికలో సహాయ సంపాదకునిగా, తెలుగు సినిమా రంగంలో స్క్రిప్టు రచయితగా పనిచేశాడు. సాహిత్య రంగంలో అనేక కథలు, రేడియో నాటికలు, సినిమా స్క్రిప్టులు, వెండితెర నవలలు రాసిన ఇతనికి తెలుగు సాహిత్య రంగంలో హిందీ సాహిత్య అనువాదకునిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేమ్‌చంద్, కిషన్ చంద్ వంటి సుప్రసిద్ధ హిందీ రచయితల నవలలు ఇతను తెలుగులోకి అనువదించాడు. ఇతని అనువాదాల్లో రష్యన్ నవలలు కూడా ఉన్నాయి. పిచ్చేశ్వరరావు స్క్రిప్ట్ రచయితగా పనిచేసిన సినిమాల్లో చివరకు మిగిలేది (1960), భార్యాభర్తలు (1960) సినిమాలు ఉన్నాయి. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రచయిత త్రిపురనేని రామస్వామి చిన్న కూతురు చౌదరాణి ఇతని భార్య. రచయితగా సినిమా, సాహిత్య రంగాల్లో రాణిస్తుండగానే 41 ఏళ్ళ వయసులో ఇతను గుండెపోటుతో మరణించాడు.
పిచ్చేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా యందు చౌటపల్లి గ్రామంలో ఏప్రిల్ 12, 1925 న జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పులపర్రు గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశాడు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కళాశాల (బందరు)లో పూర్తి చేశాడు. తన విద్య పూర్తయిన తరువాత 1945 నుండి 1953 దాక భారత నౌకా దళంలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేశాడు.[1] అతను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వంపై రాయల్ ఇండియన్ నేవీ జరిపిన తిరుగుబాటు జరిగింది.
తరువాత కొన్నేళ్ళ పాటు విశాలాంధ్ర పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేసి, 1962 లో మద్రాసుకి వెళ్ళి కొన్నేళ్ళపాటు తెలుగు సినిమాలలో స్క్రిప్టు రచయితగా ఇల్లరికం, చివరకు మిగిలేది, వాగ్దానం వంటి సినిమాలకు పనిచేశాడు. ఈ సమయంలోనే కథకుడిగా, అనువాదకుడిగా, నాటక రచయితగా పేరుపొందాడు. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘంలో ప్రధానపాత్ర పోషించారు. 1966లో గుండెపోటుతో మద్రాసులో మరణించాడు.
పిచ్చేశ్వరరావు, ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి చిన్న కూతురు చౌదరాణిని వివాహం చేసుకున్నాడు.[2] ఆమె కూడా కథా రచయిత్రి, నవలా రచయిత్రి. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించింది. ఆమె 1996 లో మరణించింది.
పిచ్చేశ్వరరావు అనేక కథలు, రేడియో నాటికలు వంటివి రాసాడు. "గౌతమ బుద్ద", "వీరేశ లింగం" అనే స్క్రిప్టులు పిచ్చేశ్వరరావు రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. హిందీ భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందాడు.
కథలు, గల్పికలు, నాటికలు
హింది నుండి తెలుగులోకి అనువాదాలు
రష్యన్ నుండి తెలుగులోకి అనువాదాలు
వెండితెర నవలలు
చలనచిత్రాలకు కథనం - సంభాషణలు
లఘు చిత్రాలు