ఆ ఒక్కడు | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) |
రచన | ఎన్.ఎస్. మూర్తి, సురేంద్ర కృష్ణ(మాటలు) |
నిర్మాత | గణేష్ ఇందుకూరి |
తారాగణం | సురేష్ గోపి అజయ్ మధురిమ సాయి సృజన్ పెల్లూరి |
ఛాయాగ్రహణం | కమలాకర్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | టాలీ2హాలీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 5 జూన్ 2009 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎన్.ఎస్. మూర్తి (దక్షిణ్ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ గోపీ, అజయ్, మధురిమ, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[2]
శ్రీకృష్ణ (సురేష్ గోపి) గుర్తింపుపొందిన క్రిమినల్ లాయర్. బుజ్జి (అజయ్) శ్రీకిష్ణ దగ్గర పని చేస్తుంటాడు. డా. పవిత్ర (మధురిమ) సైకియాట్రిస్ట్ గా ఒక మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. పవిత్రకు తన బావతో గొడవ పడుతుంది. కొద్దిరోజుల తరువాత అతను అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తాడు. అలా పవిత్రకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దాంతో అందరికి పవిత్రపై అనుమానం కలుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేసారన్నది మిగతా కథ.[3][4]
ఈ చిత్రంలోని పాటలు 2009, మే 8న హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ నటులు రవితేజ, సుబ్బరాజు, సినీ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మదన్, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సినీ నిర్మాతలు డి.సురేష్ బాబు, రామ్ ప్రసాద్ తదితరులు, చిత్ర బృందం పాల్గొన్నారు.[5]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాధ మనసా (రచన: వేదవ్యాస రంగభట్టర్)" | వేదవ్యాస రంగభట్టర్ | డా. నారాయణ్ | 4:39 |
2. | "మూతిమీదికి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | సుచరిత | 4:32 |
3. | "ఊరుకో మనసా (రచన: అనంత శ్రీరాం)" | అనంత శ్రీరాం | విజయ్ యేసుదాస్ | 4:06 |
4. | "అదేదోలే (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | రంజిత్, జ్యోత్న | 3:57 |
5. | "పడలేమురా (రచన: సాహితీ)" | సాహితీ | రంజిత్, రాహుల్ | 4:28 |
మొత్తం నిడివి: | 21:24 |