మే 26, 1928 న నెల్లూరు జిల్లాకావలి పట్టణంలో జన్మించాడు. కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్) పట్టా పుచ్చుకున్నాడు. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీలో ప్రిన్సిపాల్‌గా 1988లో ఉద్యోగ విరమణ చేశాడు. అధికార భాషాసంఘంలో సభ్యునిగా కొంతకాలం పనిచేశాడు. లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ సొసైటీ ఆహ్వానం మేరకు 1978లో ఇంగ్లాండు తదితర ఐరోపా దేశాలలో పర్యటించి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నాడు.