ఉప్వాన్ సరస్సు | |
---|---|
ప్రదేశం | థానే, మహారాష్ట్ర |
అక్షాంశ,రేఖాంశాలు | 19°13′17.61″N 72°57′21.65″E / 19.2215583°N 72.9560139°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 0.06 కి.మీ2 (0.023 చ. మై.) |
ఉప్వాన్ లేదా ఉపవాన్ సరస్సు భారతదేశంలోని మహారాష్ట్రలో గల థానేలో ఉంది. ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమం అందరిని ఆకట్టుకుంటుంది.[1][2]
ఈ సరస్సును జెకె సింఘానియ నీటి సరఫరా కోసం స్థాపించి, పునర్నిర్మించారు. సింఘానియా ఉప్వాన్ సరస్సు వద్ద వినాయకుని ఆలయాన్ని కూడా నిర్మించాడు.[3]
ఈ సరస్సు గవాంద్ బాగ్, శివాయ్ నగర్, గణేష్ నగర్, వసంత్ విహార్, వర్తక్ నగర్ సమీపంలో ఉంది. థానేలో నివసించే వ్యక్తులకు ఇది ఒక వినోద ప్రదేశం. ఇది థానేలోని అతిపెద్ద సరస్సులలో ఒకటి. దీని చుట్టూ యూర్ హిల్స్, పోఖ్రాన్- II ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని పర్యావరణ అనుకూల సరస్సులలో ఇది ఒకటి.[4]
ఉప్వాన్ సరస్సు థానేలో 'ప్రేమికుల స్వర్గం' గా పరిగణించబడుతుంది. ఉప్వాన్ సరస్సు పోఖ్రాన్ I, పోఖ్రాన్ II రహదారుల జంక్షన్‌ని ఏర్పరుస్తుంది. ఒకప్పుడు, మొత్తం థానే నగరానికి ఇది ఒక ప్రధాన నీటి వనరుగా ఉండేది. ఉప్వాన్ సరస్సు ఇప్పుడు ప్రధానంగా వినోదం కోసం ఉపయోగించబడుతుంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అధికారిక నివాసం సరస్సు ప్రక్కనే ఉంది.[5]
సాంకృతి కళల ఉత్సవం 2015 సమయంలో ఉప్వాన్ సరస్సు చక్కగా అలంకరించబడింది. పండుగ సమయాలో 50,000 మందికి పైగా ప్రజలు సరస్సును సందర్శిస్తారు.[6]