కొత్తకోట (వనపర్తి జిల్లా)

కొత్తకోట
—  రెవెన్యూ గ్రామం  —
గ్రామ పంచాయితీ కార్యాలయం, కొత్తకోట
గ్రామ పంచాయితీ కార్యాలయం, కొత్తకోట
గ్రామ పంచాయితీ కార్యాలయం, కొత్తకోట
కొత్తకోట is located in తెలంగాణ
కొత్తకోట
కొత్తకోట
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°22′47″N 77°56′18″E / 16.379745°N 77.938466°E / 16.379745; 77.938466
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండలం కొత్తకోట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 19,042
 - పురుషుల సంఖ్య 9,610
 - స్త్రీల సంఖ్య 9,432
 - గృహాల సంఖ్య 26
పిన్ కోడ్ 509381
ఎస్.టి.డి కోడ్

కొత్తకోట,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న కొత్తకోట పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళిక స్థితి

[మార్చు]
బస్సు నిలయం, కొత్తకోట

ఇది 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. రవాణా వసతులు మంచి సౌకర్యాన్ని కలిగిఉన్నాయి. దగ్గరిలోని రైల్వే స్టేషను మదనంతపురం (లేదా వనపర్తి రోడ్). ఈ రైల్వే స్టేషను నిజాం కొడుకు కాలంలో ప్రారంభమైనది. చాలామంది ఎక్కుతారు. వనపర్తి నుండి రోజూ మహబూబ్ నగర్, అప్ అండ్ డౌవ్ చేసే వారు చాలా మంది ఉంటారు.ఇది మండల కేంద్రమైన కలశపాడు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బద్వేలు నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

పరిపాలన

[మార్చు]

దీని పరిపాలన కొత్తకోట పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]
గ్రామ కూడలి

కొత్తకోట గ్రామం నుంచి నిజాం కాలంలో హైదరాబాదు వరకూ ఒక ముఖ్యమైన బాట ఉండేది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ వివరాలు వ్రాశారు.[4]

విశేషాలు

[మార్చు]
  • ఈ గ్రామంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అనంత తేజోవిరాజితంగా కోటిలింగేశ్వరస్వామి విశిష్ట లింగాకృతిలో కొలువుదీరారు. కాశీక్షేత్రం నుండి తెప్పించిన శివలింగమూర్తిని శ్రీశైల మఠాధిపతి 2007 వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు.[1]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల చీమలపల్లిలోను, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల విజయనగరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నెల్లిమర్లలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు విజయనగరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం శృంగవరపుకోటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయనగరం లోనూ ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన: 1981-82)
  • నివేదిత జూనియర్ కళాశాల (స్థాపన: 1997-98)
  • గాయత్రి ప్రైవేటు జూనియర్ కళాశాల
  • కోకిల కోఆపరేటివ్ జూనియర్ కళాశాల.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. ఉన్నాయి. సినిమా హాలు, శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కొత్తకోట (శృంగవరపుకోట)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 26 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 125 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 87 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 38 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కొత్తకోట (శృంగవరపుకోట)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 23 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 4 హెక్టార్లు
  • చెరువులు: 10 హెక్టార్లు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 14 April 2021.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లింకులు

[మార్చు]