చిన్నచింతకుంట

చిన్నచింతకుంట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలానికి చెందిన జనగణన పట్టణం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [1]ఈ మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళుతుంది. మండలం నారాయణపేట డివిజన్‌లో పరిధిలోని భాగము.మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.

గణాంకాలు

[మార్చు]
కురుమూర్తి స్వామి దేవాలయ ప్రవేశద్వారం

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.

2001 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం 44548 జనాభా ఉంది.10180 కుటుంబాలు.[2] అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.[3]పిన్ కోడ్: 509131.

ఇతర విశేషాలు

[మార్చు]

తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది.

సంఘటనలు

[మార్చు]
  • 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందాడు.[4]
కురుమూర్తిస్వామి మెట్లదారి

రాజకీయాలు

[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మానస ఎన్నికయింది.[5]

మండలంలోని ప్రముఖ ఆలయాలు

[మార్చు]
కురుమూర్తిస్వామి దేవాలయం

ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన కురుమూర్తి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  2. Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  4. ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
  5. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు

[మార్చు]