రకం | పబ్లిక్ రంగం |
---|---|
పరిశ్రమ | ఆర్థిక కార్యకలాపాలు |
స్థాపన | 2018 |
స్థాపకుడు | ముఖేష్ అంబానీ |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం |
ఉత్పత్తులు | బ్యాంకింగ్ |
మాతృ సంస్థ | జియో పేమెంట్ బ్యాంక్ |
జియో పేమెంట్ బ్యాంక్ ఏప్రిల్ 3 2018 నుంచి దీని సేవలు మొదలయ్యాయి. ఆగస్టు 19, 2015న రిలయన్స్ జియో ఈ పేమెంట్ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949 పరిధిలోని సెక్షన్ 22 (1) కింద రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లైసెన్స్ జారీ చేసింది.[1]
రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈ బ్యాంక్ యొక్క లావాదేవీలు చూస్తుంది. ఈ బ్యాంకు ఎస్‌బిఐతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది . ఇందులో 70 శాతం నిధులను రిలయన్స్ ఇండస్ట్రీ, 30 శాతం నిధులను ఎస్‌బిఐ సమకూరుస్తుంది.[2] జియో బ్యాంకుతో పాటు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఫినో కార్పొరేషన్, పేటిమ్ కంపెనీలు 2015 ఆగస్టు 19న లైసెన్స్ పొందిన జాబితాలో ఉన్నాయి.