జుట్టు నరసింహం

జుట్టు నరసింహం
జన్మ నామంనరసింహన్
జననం 1931
మరణం మార్చి 11, 2009
చెన్నై
ఇతర పేర్లు ఓమకుచ్చి నరసింహన్
క్రియాశీలక సంవత్సరాలు 1981-2008
భార్య/భర్త సరస్వతి
పిల్లలు విజయలక్ష్మి, నిర్మల, కామేశ్వరన్
ప్రముఖ పాత్రలు మంగమ్మగారి మనవడు

జుట్టు నరసింహం ప్రముఖ హాస్యనటుడు. ఇతడు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 భారతీయ భాషలలో 1500 చలనచిత్రాలలో పనిచేశాడు. "ఇండియన్ సమ్మర్" అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. తెలుగు సినిమా రంగంలో "జుట్టు నరసింహం"గా స్థిరపడిన ఈ నటుడు తమిళ సినిమాలలో "ఓమకుచ్చి నరసింహన్"(బక్క నరసింహన్)గా సుపరిచితుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రం, కరూర్ జిల్లా, కట్టలై గ్రామంలో 1931లో జన్మించాడు. తన 13వ యేట అవ్వయార్ చిత్రంలో మొదటిసారి నటించాడు. చదువు పూర్తి చేసిన తరువాత కొంతకాలం జీవితభీమా సంస్థలో పనిచేశాడు. తర్వాత తన గురువు, నటుడు సురుళి రాజన్ ప్రోత్సాహంతో 1969లో తిరుకళ్యాణం అనే తమిళ సినిమాతో పునఃప్రవేశం చేశాడు. ఇతనికి భార్య సరస్వతి, కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, కుమారుడు కామేశ్వరన్ ఉన్నారు. ఇతడు గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 78వ యేట 2009, మార్చి 11న మరణించాడు[1].

నటించిన తెలుగు సినిమాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]