తిక్కవరపు సుబ్బరామిరెడ్డి | |
---|---|
జననం | తిక్కవరపు సుబ్బరామిరెడ్డి సెప్టెంబరు 17, 1943 నెల్లూరు |
ప్రసిద్ధి | రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత , పారిశ్రామికవేత్త |
పదవి పేరు | పార్లమెంటు సభ్యుడు |
పదవీ కాలం | 1996 , 1998 సంవత్సరాలలో 11వ , 12వ లోక్‌సభ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
భార్య / భర్త | ఇందిరా సుబ్బరామిరెడ్డి |
తండ్రి | బాబు రెడ్డి, |
తల్లి | రుక్మిణమ్మ |
తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (ఆంగ్లం: T. Subbarami Reddy) (జ. సెప్టెంబరు 17, 1943) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభ లకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితుడయ్యాడు.[1]
సుబ్బరామిరెడ్డి 1943, సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు.[2] హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితో వివాహమైనది.
ఇతడు తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించాడు. సంస్కృతంలో ఇతడు నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
ఇతడు నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా: