దత్తా గైక్వాడ్

దత్తా గైక్వాడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్
పుట్టిన తేదీ(1928-10-27)1928 అక్టోబరు 27
వడోదర, బరోడా రాష్ట్రం, బ్రిటీష్ రాజ్
మరణించిన తేదీ2024 ఫిబ్రవరి 13(2024-02-13) (వయసు 95)
వడోదర, గుజరాత్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగురైట్-ఆమ్ మీడియం, లెగ్‌బ్రేక్
బంధువులుఅన్షుమన్ గైక్వాడ్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 60)1952 5 జూన్ - ఇంగ్లండ్ తో
చివరి టెస్టు1961 13 జనవరి - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1948–1963బరోడా
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్‌లు ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 11 110
చేసిన పరుగులు 350 5,788
బ్యాటింగు సగటు 18.42 36.40
100లు/50లు 0/1 17/23
అత్యధిక స్కోరు 52 249*
వేసిన బంతులు 12 1,964
వికెట్లు 0 25
బౌలింగు సగటు 40.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/117
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 49/–
మూలం: ESPNcricinfo

దత్తా గైక్వాడ్ (1928 అక్టోబరు 27 - 2024 ఫిబ్రవరి 13) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతని పూర్తి పేరు దత్తారావు కృష్ణారావు గైక్వాడ్. భారత్ తరఫున ఇతడు 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1952, 1959లో ఇంగ్లాండు పర్యటించిన, 1952-53లో వెస్టీండీస్ పర్యటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. 1959లో పర్యటించిన భారత జట్టుకు నాకకత్వం కూడా వహించాడు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

దత్తా గైక్వాడ్ ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయం, బరోడాలోని మహారాజా సవాజి విశ్వవిద్యాలయం తరఫున ఆడినాడు. 1952లో లీడ్స్ లో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. ఎప్పుడూ ఓపెనింగ్ బ్యాత్స్‌మెన్‌గా విధులు నిర్వర్తించకనే ఏకంగా తొలి టెస్టులోనే ఓపెనర్‌గా రంగప్రవేశం చేశాడు. తదుపరి సంవత్సరంలో వెస్టీండిస్ పర్యటనలో రెండో టెస్టులో క్యాచ్ పట్టేసమయంలో విజయ్ హజారేతో ఢీకొని భుజం గాయం కారణంగా వెస్టీండీస్ పర్యటన అర్థాంతరంగా ఆగిపోయింది.

1957-58లో బరోడా రంజీ జట్టుకు నేతృత్వం వహించి త్రోఫీ సంపాదించిపెట్టాడు. తొమ్మిదేళ్ళలో బరోడాకు ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఇదే సీజన్‌లో బలవంతమైన బాంబే రంజీ జట్టుపై డబుల్ సెంచరీ సాధించి సెలెక్టర్లను ఆకట్టుకొని 1958-59లో వెస్టీండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులోకి చివరి టెస్టు కొరకు ఆహ్వానించబడ్డాడు. ఆ టెస్టు రెండో ఇన్నింగ్సులో చేసిన 52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ జీవితంలో సాధించిన ఏకైక అర్థసెంచరీ. 1959లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు హేము అధికారి కెప్టెన్ కాగా అతడు అందుబాటులో లేకపోవడంతో దత్తా గైక్వాడ్ సారథ్యం వహించాడు. కాని సీరీస్ సమయంలో అస్వస్థతకు గురై జట్టుపై పట్టు కోల్పోయాడు. ఆ సీరీస్‌లోని మొత్తం 5 టెస్టులలో పరాజయం పాలై మళ్ళీ దత్తా గైక్వాడ్ టెస్టులలో ఆడలేకపోయాడు.

రంజీ ట్రోఫీ

[మార్చు]

దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3139 పరుగులు సాధించాడు. రంజీలో అతని అత్యధిక స్కోరు 1959-60లో మహారాష్ట్రపై సాధించిన 249 పరుగులు.

కుటుంబం

[మార్చు]

భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అన్షుమన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడే. ఇతనికి బరోడా రాజకుటుంబీకులతో కూడా సంబంధముంది. బరోడా సంస్థానానికి డిప్యూటీ కంప్ట్రోలర్‌గా కూడా పనిచేశాడు.

మరణం

[మార్చు]

దత్తాజీరావు గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో 2024 ఫిబ్రవరి 13న బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు[1].

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "టీమిండియా మాజీ కెప్టెన్‌ కన్నుమూత.. | Former Indian cricket team captain Dattajirao Gaekwad passes away - Sakshi". web.archive.org. 2024-02-13. Archived from the original on 2024-02-13. Retrieved 2024-02-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)