దాసరి మారుతి | |
---|---|
జననం | [1] | 1981 అక్టోబరు 8
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2005 - ప్రస్తుతము |
జీవిత భాగస్వామి | వీణారాగ స్పందన (2003 -ఇప్పటి వరకు) |
పిల్లలు | 1 |
దాసరి మారుతీ ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.[2]
ఇతడిది మచిలీపట్నం.[3] పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. జూబ్లీహిల్స్ లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. గోల్కొండ, చార్మినార్, నెహ్రూ జంతుప్రదర్శనశాలలోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు. ప్రభాస్ ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది ఈ చిత్రం. [4]
సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | నిర్మాత | గమనికలు |
---|---|---|---|---|---|
2012 | ఈ రోజుల్లో | ||||
బస్ స్టాప్ | |||||
2013 | ప్రేమకథా చిత్రమ్ | ||||
రొమాన్స్ | |||||
2014 | లవ్ యు బంగారమ్ | ||||
గ్రీన్ సిగ్నల్ | |||||
లవర్స్ | స్క్రీన్ ప్లే | ||||
కొత్త జంట | |||||
2015 | బెస్ట్ యాక్టర్స్ | ||||
భలే భలే మగాడివోయ్ | |||||
2016 | భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్ | ||||
బాబు బంగారం | |||||
రోజులు మారాయి | |||||
2017 | లండన్ బాబులు | ||||
మహానుభావుడు | |||||
2018 | బ్రాండ్ బాబు | ||||
శైలజా రెడ్డి అల్లుడు | |||||
2019 | ప్రతిరోజూ పండగే | ||||
2021 | మంచి రోజులు వచ్చాయి | [6] | |||
3 రోజెస్ | షో రన్నర్ | ఆహా వెబ్ సిరీస్[7] | |||
2022 | పక్కా కమర్షియల్ | ||||
2024 | భలే ఉన్నాడే | [8] | |||
2024 | ది రాజా సాబ్ |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)