దినకర దేశాయి | |
---|---|
రచయిత మాతృభాషలో అతని పేరు | ದಿನಕರ ದೇಸಾಯಿ |
పుట్టిన తేదీ, స్థలం | 10 సెప్టెంబర్ 1909 అంకోలా, కర్ణాటక, భారతదేశం |
మరణం | 6 నవంబర్ 1982 ముంబాయి |
వృత్తి | కవి, రచయిత, విద్యావేత్త, రాజకీయ, సామాజిక కార్యకర్త |
సాహిత్య ఉద్యమం | చుటుకా లేదా చుటుకు |
దినకర దేశాయి ఒక కవి, రచయిత, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త. అతను చుటుక (చుటుక బ్రహ్మ) అనే కవితా రూపానికి ప్రసిద్ధి చెందాడు. చుటుకా లేదా చుటుకు అనేది కొన్ని నియమాలతో కూడిన కవితా ప్రక్రియ. ఈ పద్ధతిని ఇతని తరువాత ఇతర కవులు స్వీకరించారు. ఆయన ప్రధానంగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సాహిత్య వికాసానికి కృషి చేశాడు.[1]
దినకర దేశాయి 1909 సెప్టెంబర్ 10 న అంకోలా (ఉత్తర కర్ణాటక ప్రాంతం)లో దినకర్ దత్తాత్రే దేశాయి, అంబిక దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. అతని ఇద్దరు అన్నలు - యశ్వంత్, శంకర్; ఒక చెల్లెలు - సరస్వతి. దినకర్ 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లి మరణించింది.
దేశాయ్ మొదట్లో న్యాయవాదిగా పనిచేశాడు, అయితే కార్మిక సంఘ కార్యకర్తలు M. N. జోషి, థక్కర్ బాషాలచే ప్రభావితం చేయబడి, కార్మిక ఉద్యమానికి దోహదపడేలా ప్రేరేపించబడ్డాడు. అతను గోపాల కృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరాడు, ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా దేశానికి సేవ చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. కర్ణాటకలోని బీజాపూర్, ధార్వాడ్ ప్రాంతాలలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు వారికి ఉపశమనం కలిగించడంలో సహాయం చేశాడు.[2]
ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ నుండి వచ్చిన ప్రకటన అతని జీవిత గమనాన్ని మార్చేసింది. అతను సామాజిక సేవ కోసం జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుని, 1935 లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ముంబై ఆఫీసులో ఎంపికయి, సభ్యుడిగా చేరాడు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు శ్రీ ఎస్ ఎం జోషి మార్గదర్శకత్వంలో అతను తన కెరీర్‌ను రూపొందించుకున్నాడు. సేవకు అంకితభావంతో అతను జీవితకాల సభ్యుడిగా, సొసైటీ ముంబై కార్యాలయ అధిపతిగా కూడా పనిచేశాడు.[3]
దినకర్ దేశాయికి ఉన్న దీర్ఘకాలిక మధుమేహం వలన అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో 6 నవంబర్ 1982 న ముంబైలో మరణించాడు.
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)