భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా | |
---|---|
![]() | |
6వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1 అక్టోబరు 1959 – 31 జనవరి 1964 | |
Appointed by | బాబూ రాజేంద్ర ప్రసాద్ |
అంతకు ముందు వారు | సుధీ రంజన్ దాస్ |
తరువాత వారు | పి.బి. గజేంద్రగడ్కర్ |
నాగ్‌పూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | |
In office 1951-1954 | |
అంతకు ముందు వారు | ప్రకాష్ చంద్ర తాటియా డి.ఎన్. పటేల్ |
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి | |
In office 1943-1951 | |
సుప్రీంకోర్టు న్యాయమూర్తి | |
In office 1954–1959 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | రాజ్‌వాడ గజియాపూర్, భోజ్‌పూర్ జిల్లా, బీహార్ | 1899 ఫిబ్రవరి 1
మరణం | 12 నవంబరు 1986 | (aged 87)
భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, (1899, ఫిబ్రవరి 1 - 1986, నవంబరు 12) భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి. 1959 అక్టోబరు 1 నుండి 1964 జనవరి 31 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1965 ఏప్రిల్ నుండి 1967 ఫిబ్రవరి వరకు భారత్ స్కౌట్స్, గైడ్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
ప్రసాద్ సిన్హా 1899 ఫిబ్రవరి 1న బీహార్ రాష్ట్రం భోజ్‌పూర్ జిల్లా, రాజ్‌వాడ గజియాపూర్ ఎస్టేట్‌లోని ప్రముఖ ఉన్నత కుల హిందూ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. అర్రా జిల్లా స్కూల్, పాట్నా కళాశాల, పాట్నా న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు. పాట్నా విశ్వవిద్యాలయంలో 1919లో బిఏ (ఆనర్స్), 1921లో ఎంఏ అభ్యర్థుల జాబితాలో సిన్హా అగ్రస్థానంలో నిలిచాడు. ఇతని మనవడు బిపి సింగ్ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశాడు.
1922 నుండి 1927 వరకు పాట్నా హైకోర్టులో వకీల్‌గా పనిచేశాడు. తరువాత 1927లో న్యాయవాదిగా, పాట్నా ప్రభుత్వ న్యాయ కళాశాలో లెక్చరర్ గా చేరి 1935 వరకు పనిచేశాడు. పాట్నా యూనివర్సిటీలోని లా ఫ్యాకల్టీ, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఇన్ లా సెనేట్ సభ్యుడు కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. 1935 నుండి 1939 వరకు ప్రభుత్వ ప్లీడర్‌గా ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కోర్ట్ సభ్యుడుగా ఉన్నాడు. చరిత్రలో మొదటి స్థానంలో నిలిచినందుకు శ్రీమతి రాధికా సిన్హా గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
1940లో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా, 1943లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా మారాడు. 1951లో నాగ్‌పూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 1954 డిసెంబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. 1959 సెప్టెంబరు 30 వరకు కొనసాగాడు. 1959లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 1964 వరకు కొనసాగి పదవీ విరమణ చేశాడు.[1]
పదవీ విరమణ తరువాత, అనేక ప్రైవేట్ మధ్యవర్తిత్వ కేసులను అంగీకరించిన ప్రసాద్ సిన్హా, తరువాతి సంవత్సరాలలో అంధుడిగా మారాడు. ఇతను 1986 నవంబరు 12న మరణించాడు.[2]