ఎం. వి. రావు | |
---|---|
జననం | 21 జూన్ 1928 పేరుపాలెం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | 8 మార్చి 2016 హైదరాబాదు |
వృత్తి | వ్యవసాయ శాస్త్రవేత్త జెనెటిసిస్టు ప్లాంట్ బ్రీడర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1956 నుండి |
వీటికి ప్రసిద్ధి | భారతదేశంలో హరిత విప్లవం |
పురస్కారాలు | పద్మశ్రీ నార్మన్ బార్లాగ్ అవార్డు లింకెర్స్ అవార్డు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అవార్డు డా. పి.శివారెడ్డి ఫౌండేషన్ అవార్డు డా. శ్రీకాంతియ మెమోరియల్ అవార్డు ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అకాడమీ బంగారు పతకం కృషి శిరోమణి సమ్మాన్ మహేంద్ర సమృద్ధి ఇండియా అగ్రి అవార్డు శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు |
మంగిన వేంకటేశ్వరరావు (1928-2016) భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్లాంట్ బ్రీడరు, జెనెటిసిస్టు, అగ్రి బయోటెక్ ఫౌండేషన్ చైర్మన్.[1] ఆయన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మాజీ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ICAR) కు మాజీ డిప్యూటీ డైరక్టరుగా తన సేవలనందించారు.[2] ఆయనకు నార్మాన్ బార్లాగ్ అవార్డు వచ్చింది. ఆయన భారత అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీని 1999లో పొందారు.[3][4]
ఆయన జూన్ 21 1928న పశ్చిమ గోదావరి జిల్లా లోని పేరుపాలెంలో జన్మించారు.[2] మాస్టర్స్ డిగ్రీ పొందిన తరువాత ఆయన పుర్దూ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ బ్రీడింగ్, జెనిటిక్స్ అంరియు ప్లాంట్ పాథాలజీ అనే అంశాలపై పరిశోధనలు డాక్టరల్ డిగ్రీ కొరకు చేసారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ICAR) కు 196లో అసిస్టెంట్ గోధుమ బ్రీడార్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన గోధుమ పరిశోధనలపై నిమగ్నమై 1958 లో అసిస్టెంట్ ప్రొఫెసరుగా బాధ్యతలు నిర్వహించారు.[5] 1966లో ఆయన జెన్‌టెటిసిస్టుగా పదోన్నతి పొంది సీనియర్ జెనెటిసిస్టుగా బాధ్యతలు నిర్వహించారు.[5] ఆయన కోఆర్డినేటరుగా 1971 లోనూ, 1978 లో "ఆల్ ఇండియా వీట్ ఇంప్రూవ్‌మెంటు ప్రాజెక్టు"లో విభాగాధిపతిగా సేవలనందించారు. ఆ ఉద్యోగంలో 1981 వరకు ఉన్నారు.[6] ఈ కాలంలో ఆయన హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 1981 లో ఐ.సి.ఎ.ఆర్ యొక్క డిప్యూటీ డైరక్టరు జనరల్ గా సేవలనందించారు. 1986 లో ప్రైం మినిస్టర్స్ టెక్నాలజీ మిసన్ ఆన్ ఆయిల్ సీడ్స్ లో ప్రత్యేక సెక్రటరీగా నియమింపబడ్డారు. ఈ "యెల్లో రివల్యూషన్" (ఆయిల్ సీడ్స్ అభివృద్ధికొరకు కార్యక్రమం) కాలంలో ఆయన విశేష సేవలనందించారు.[7]
1989లో వ్యవసాయ నిపుణునిగా ప్రపంచ బ్యాంకు వారిచే ఆహ్వానింపబడ్డారు. అచట 1990 వరకు పనిచేసారు. తరువాత ఆయన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా 1997 వరకు పనిచేసారు.[2] ఈ కాలంలో ఆయన "అగ్రి బయోటెక్ ఫౌండేషన్"తో సమన్వయమై దాని చరిమన్ గా 1995 వరకు క్రియాశీలకంగా పనిచేసారు.[5] ఆయన అధ్వర్యంలో జన్యుపరమైన ఉత్పరివర్తనలు జరిగి కాటన్, సోర్గాం, కాస్టర్, రెడ్ గ్రాం వంటి విత్తనాల రకాలకు జన్యుపరంగా మార్పులు జరిగినవి.[8]
ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కు 2000–2003 మధ్య కాలంలో వైస్ ప్రెసెడెంటుగా ఉన్నారు.[9] క్రొత్త జాతీయ విత్తన పాలసీ యొక్క కమిటీలో ఉండి అనేక భారతదేశ రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసారు.[10] బంగ్లాదేశ్ లోని వ్యవసాయాభివృద్ధి కొరకు ప్రపంచ బ్యాంకు యొక్క ప్రాజెక్టు అయిన "నేషనల్ అగ్రికల్చరల్ టెక్నాలజీ ప్రాజెక్టు"లో సభ్యునిగా ఉండి అనేక మార్గదర్శకాలను అందించారు.[11] ఆయన "కోస్టల్ ఎకో సిస్టమ్స్"కు శాస్త్రీయ సలహాదారు పాలెల్ లో కూడా తన సేవలనందించారు.[2] ఆయన భారతదేశంలోణి ఇంటర్నెషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో 1984 నుండి 1989 వరకు సభ్యునిగా ఉన్నారు.[12] ఆయన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క "వీట్ అడ్వయిజరీ కమిటీ"లో సభ్యునిగానూ, ఫిలిప్పీన్స్ లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ట్రస్టీ గానూ, ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్ మెంటు సెంటరు యొక్క నిపుణుల కమిటీలో సభ్యునిగానూ పనిచేసారు.[10] ఆయన భారతదేశంలోని ఇంటర్ కల్చరల్ కోపరేషన్ ఫౌండేషన్లో సభ్యునిగా ఆర్కాట్ రామచంద్రన్ తో కలసి పనిచేసారు.[13]