మహారాజపురం సంతానం | |
---|---|
జననం | మహారాజపురం విశ్వనాథ సంతానం 1928 మే 20 సిరునంగూర్, తమిళనాడు |
మరణం | 1992 జూన్ 24 | (వయసు 64)
వృత్తి | కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు |
మహారాజపురం సంతానం, (20 మే 1928[1]-24 జూన్ 1992[2]) 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులలో ఎన్నదగినవాడు.
ఇతడు 1928,మే 20వ తేదీన తమిళనాడు రాష్ట్రం సిరునంగూర్ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మహారాజపురం విశ్వనాథ అయ్యర్ కూడా సంగీత విద్వాంసుడే. ఇతడు తన తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత మేలత్తూరు శ్యామ దీక్షితార్ వద్ద మరింత క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఇతడు మంచి స్వరకర్త కూడా. మురుగన్ పై, కంచి శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిపై అనేక పాటలు వ్రాశాడు. ఇతడు శ్రీలంకలోని రామనాథన్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. [3] తర్వాత ఇతడు చెన్నైలో స్థిరపడ్డాడు. ఇతడు పాడిన పాటలలో రేవతి రాగంలో "భో శంభో శివ శంభో స్వయంభో", బాగేశ్రీ రాగంలో "మధుర మధుర మీనాక్షి మధురాపురి నిలయే", మేచకళ్యాణి రాగంలో "ఉన్నైయల్లాల్ వేరే గతి ఎనక్కుందో" , షణ్ముఖప్రియ రాగంలో "సదా నీ పాదమే గతి, షణ్ముఖప్రియ రాగంలోవరం ఒన్రు తందరుళ్వాఇ వడివేలా" , రాగమాలిక రాగంలో "శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ", రాగమాలిక రాగంలో"నళిన కాంతి మతిం" రాగమాలిక రాగంలో"క్షీరాబ్ది కన్యకె", శుద్ధ ధన్యాశి రాగంలో "నారాయణ నిన్న నామద స్మరణెయ", "గోవిందా నిన్న నామవె చంద" మొదలైనవి ప్రజాదరణ పొందాయి. ఇతని కీర్తనలలో భక్తి రసం ఎక్కువగా ఉంటుంది.
ఇతడు 1992, జూన్ 24న చెన్నైలో ఒక కారు ప్రమాదంలో మరణించాడు. ఇతని కుమారులు మహారాజపురం ఎస్.శ్రీనివాసన్, మహారాజపురం ఎస్. రామచంద్రన్, ఇతని శిష్యుడు ఆర్.గణేష్ ఇతని సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఇతని జ్ఞాపకార్థం చెన్నై టి.నగర్‌లోని ఒక వీధికి "మహారాజపురం సంతానం సాలై" అని పేరుపెట్టారు.