మేకపాటి గౌతమ్ రెడ్డి | |||
![]()
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2014 - 2022 ఫిబ్రవరి 21 | |||
ముందు | ఆనం రామనారాయణరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆత్మకూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 15, 1972 బ్రాహ్మణపల్లి, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 2022 ఫిబ్రవరి 21 హైదరాబాద్ | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
తల్లిదండ్రులు | మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి | ||
జీవిత భాగస్వామి | శ్రీకీర్తి | ||
బంధువులు | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (బాబాయి), మేకపాటి విక్రమ్ రెడ్డి (సోదరుడు)[1] | ||
సంతానం | అనన్య రెడ్డి (కూతురు), అర్జున్ రెడ్డి (కొడుకు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త |
మేకపాటి గౌతమ్‌రెడ్డి (1972 ఆగష్టు 15 - 2022 ఫిబ్రవరి 21) నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయవేత్త. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుండి 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. గౌతమ్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు.
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో 1972 ఆగష్టు 15న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు జన్మించాడు. ఆయన ఊటీలోని గుడ్ షెపర్డ్ లో పాఠశాల విద్య, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ, భద్రుకా కళాశాలలో డిగ్రీ, మాంచెస్టర్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో ఎమ్మెస్సీ (టెక్స్‌టైల్స్) 1994 -1997లో పూర్తి చేశాడు.[2]
గౌతంరెడ్డి తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గూటూరు మురళి కన్నాబాబు పై 30,191 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2019లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు.[3][4][5]
మేకపాటి గౌతమ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[6] గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[7] ఆయనకు భార్య మేకపాటి శ్రీకీర్తి, కూతురు సాయి అనన్య రెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు.[8][9]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)