?మోధేరా గుజరాత్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23°34′57″N 72°07′50″E / 23.5826361°N 72.1305281°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | మెహసానా జిల్లా |
జనాభా | 6,373 (2011 నాటికి) |
మోధేరా భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, మెహసానా జిల్లాలోని గ్రామం. ఇది 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశ రాజు భీమ్‌దేవ్ సోలంకి పాలనలో నిర్మించిన సూర్య దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం పుష్పావతి నది ఒడ్డున ఉంది.[1] ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి సౌరశక్తి గ్రామం.
పురాణాలలో ఈ ప్రాంతాన్ని ధర్మారణ్యంగా పిలిచేవారు. పురాణాల ప్రకారం, రాముడు, రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టే స్థలం కోసం వశిష్ట మహర్షిని అడుగుతాడు. అపుడు వసిష్ఠ ముని ధర్మారణ్యానికి వెళ్లమని చెపుతాడు. ధర్మారణ్యంలో రాముడు మోధేరక గ్రామాన్ని స్థాపించి అక్కడ యజ్ఞం చేశాడు. తరువాత ఈ గ్రామం మోధేరాగా పిలువబడింది.[1]సా.శ 1026లో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్‌దేవ్ సోలంకి సూర్య దేవాలయాన్ని స్థాపించాడు.[2][3] 16-17వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వరి వావ్ ఈ గ్రామంలో ఉంది. ఈ వావ్‌లో చివరి అంతస్తులో ఆలయం కాకుండా మొదటి అంతస్తులో ఆలయం ఉంది.[4]
మోధేరా పుష్పావతి నది ఒడ్డున ఉంది. ఇది పటాన్ నగరానికి దక్షిణంగా 34 కి.మీ, అహ్మదాబాద్‌కు దాదాపు 100 కి.మీ దూరంలో వాయువ్యంగా ఉంది. మెహసానా నగరం నుండి 26 కి.మీ దూరంలో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ గ్రామంలో 6,373 మంది జనాభా ఉన్నారు. వీరిలో 3335 మంది పురుషులు, 3038 మంది స్త్రీలు. గుజరాతీ, హిందీ మాట్లాడే జనాభాలో దాదాపు 95% హిందువులు, 5% ముస్లింలు ఉన్నారు. ఇక్కడ పురుషుల నిష్పత్తి స్త్రీల కంటే దాదాపు 10% ఎక్కువ.[5]మోధేరాలో పురుషుల అక్షరాస్యత 87.31% ఉండగా స్త్రీల అక్షరాస్యత రేటు 67.34% గా ఉంది.
సాంప్రదాయకంగా, మెహసానా జిల్లాలో వ్యవసాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నగరాలు లేదా పెద్ద పట్టణాలలో, హస్తకళలు, రిటైల్ వ్యాపారం ముఖ్యమైనవి. ఇక్కడ టెంపుల్ టూరిజం చిన్న పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వంతో కలిసి మోధేరా సూర్య దేవాలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జన్‌పురా, మెహసానా వద్ద ‘సోలరైజేషన్ ఆఫ్ మోధేరా సూర్య మందిర్ టౌన్’ను ప్రారంభించింది, ఇది బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మొధేరా గ్రామానికి నిత్యం సౌర విద్యుత్తును అందిస్తుంది. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం రెండు దశల్లో 50-50 ప్రాతిపదికన రూ. 80.66 కోట్లు ఖర్చు చేశాయి. మొదటి దశలో రూ.69 కోట్లు, రెండవ దశలో రూ. 11.66 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మోధేరా గ్రామంలోని ఇళ్లపై 1 కెడబ్ల్యూ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు అమర్చారు. ఈ ప్యానెళ్ల ద్వారా పగటిపూట విద్యుత్తు సరఫరా అవుతుంది. సాయంత్రం సమయంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ద్వారా గృహాలకు విద్యుత్ సరఫరా అవుతుంది.[6] ఈ ప్రాజెక్ట్ ద్వారా, నికర పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే దేశంలోని మొదటి గ్రామంగా, అదనంగా సౌరశక్తిపై ఆధారపడిన అల్ట్రా-ఆధునిక విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను కలిగి ఉన్న మొదటి గ్రామంగా అవతరించింది. అక్టోబరు 9, 2022న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి సౌరశక్తితో పనిచేసే గ్రామంగా మోధేరాను ప్రకటించాడు. [7]
టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్ ద్వారా ఏటా ఉత్తరార్ధ్ మహోత్సవ్ (మోధేరా నృత్య పండగ) నిర్వహించబడుతుంది, దీనిని జనవరి మూడవ వారంలో నిర్వహిస్తారు.
{{cite book}}
: Check date values in: |archive-date=
(help)