రాంనరేష్ శర్వాన్

రాంనరేష్ శర్వాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాంనరేష్ రోనీ శర్వాన్
పుట్టిన తేదీ (1980-06-23) 1980 జూన్ 23 (వయసు 44)
వేక్‌నాం ఐలాండ్, గయానా
మారుపేరురాము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం లెగ్ బ్రేక్
పాత్రBatsman
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 234)2000 మే 18 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2011 జూన్ 28 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 101)2000 జూలై 20 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2013 జూన్ 11 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.53
తొలి T20I (క్యాప్ 20)2007 సెప్టెంబరు 11 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2010 మే 20 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996–2014Guyana
2005Gloucestershire
2008Kings XI Punjab
2012–2014Leicestershire (స్క్వాడ్ నం. 53)
2013–2014Guyana Amazon Warriors
2016Trinbago Knight Riders (స్క్వాడ్ నం. 53)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 87 181 220 265
చేసిన పరుగులు 5,842 5,804 13,405 8,488
బ్యాటింగు సగటు 40.01 42.67 38.52 40.61
100లు/50లు 15/31 5/38 33/71 11/50
అత్యుత్తమ స్కోరు 291 120* 291 120*
వేసిన బంతులు 2,022 581 4,368 1,130
వికెట్లు 23 16 56 35
బౌలింగు సగటు 50.56 36.62 41.98 28.60
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/37 3/31 6/62 5/10
క్యాచ్‌లు/స్టంపింగులు 53/– 45/– 155/– 68/–
మూలం: ESPNcricinfo, 2021 డిసెంబరు 3

1980, జూన్ 23న జన్మించిన రాంనరేష్ శర్వాన్ (Ramnaresh Ronnie Sarwan) వెస్ట్‌ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారతీయ-గుయానా సంతతికి చెందినవాడు. 2000 మేలో బార్బడస్లో పాకిస్తాన్ పై మొదటి టెస్ట్ ఆడినప్పటినుంచి క్రమంతప్పకుండా ఇతడు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్సులోనే 84 పరుగులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

2000లో పాకిస్తాన్‌పై తొలి టెస్టు మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన శర్వాన్ ఇప్పటి వరకు 67 టెస్టులలో 4303 పరుగులు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 261 (నాటౌట్). టెస్టులలో 9 సెంచరీలు, 26 అర్థసెంచరీలు కూడా సాధించాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్సులో 84 పరుగులు చేసిన శర్వాన్ 2001 మార్చిలో దక్షిణాఫ్రికాపై 91 పరుగులవద్ద రనౌట్ అయి తొలి శతకాన్ని జారవిడుచుకున్నాడు. 2002 అక్టోబర్లో భారత్ పై చెన్నైలో 78 పరుగులు చేసి సెంచరీ సాధించే మరో అవకాశాన్ని వదులుకున్నాడు. ఇలా 4 పర్యాయాలు 75పైగా పరుగులు చేసి ఔటై చివరికి ఢాకాలో బంగ్లాదేశ్ పై తొలి శతకాన్ని నమోదుచేశాడు. 2004 జూన్లో బంగ్లాదేశ్ పైనే 261 (నాటౌట్) పరుగులు సాధించి తన అత్యుత్తమ స్కోరును మెరుగుపర్చుకున్నాడు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే శర్వాన్ టెస్టులలో 23 వికెట్లు కూడా పడగొట్టినాడు.

వన్డే క్రికెట్

[మార్చు]

శర్వాన్ ఇప్పటివరకు 124 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 4099 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 26 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 12 వికెట్లు కూడా సాధించాడు.

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

శర్వాన్ వెస్ట్‌ఇండీస్ జట్టు తరఫున 2003, 2007 ప్రపంచ కప్ క్రికెట్‌లో పాల్గొన్నాడు.

వెస్ట్‌ఇండీస్ కెప్టెన్‌గా

[మార్చు]

వెస్ట్‌ఇండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రిటైర్‌మెంట్ అనంతరం 2007, ఏప్రిల్ 29న శర్వాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడింది.

రికార్డులు

[మార్చు]

2006, జూన్ 23న తన 26 పుట్టినరోజు నాడు ఒకే ఓవర్‌లో భారత్ పై ఆడుతూ మునాఫ్ పటేల్ వేసిన ఆరు బంతులను కూడా బౌండరీ దాటించి ఈ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. (ఈ ఘనత పొందిన తొలి క్రికెటర్ భారత్‌కు చెందిన సందీప్ పాటిల్).

బయటి లింకులు

[మార్చు]