రాజు గారి గది | |
---|---|
దర్శకత్వం | ఓంకార్ |
తారాగణం | అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, పోసాని కృష్ణ మురళి, ధన్‌రాజ్, రాజీవ్ కనకాల, విద్యుల్లేఖ రామన్ |
ఛాయాగ్రహణం | జ్ఞానం |
కూర్పు | నాగరాజు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థలు | వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 16 అక్టోబరు 2015 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹3 crore (US$3,80,000) |
రాజు గారి గది 2015, అక్టోబరు 16 న విడుదల అయిన భయానకమైన తెలుగు హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా 2017 లో రాజు గారి గది 2, 2019 లో రాజు గారి గది 3 సినిమాలు వచ్చాయి.
నందిగామ లోని ఒక పాత రాజ మహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజ మందిరాన్ని గవర్నమెంట్ మూసి వేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ కార్యక్రమం ను ప్లాన్ చేసి ఆ రాజ మహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7 మందిని సెలక్ట్ చేస్తారు.
అలా సెలక్ట్ చేసిన అశ్విన్ (అశ్విన్ కుమార్), డా. నందన్ (చేతన్ చీను), ధన్య బాలకృష్ణ (బాల), ఈశాన్య (బార్బీ), బుజ్జిమ (విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం (శకలక శంకర్), శివుడు (ధన రాజ్) లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజ మహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజ మహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1][2]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "లా లాల లాలల" (వాయిద్యం) | 2:33 | |||||||
2. | "సోనే మోరియా (రచన: చంద్రబోస్)" | 2:58 | |||||||
3. | "చూ మంత్రకాళి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | 3:10 | |||||||
8:41 |
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా[3] వారు దీనికి సీక్వెల్ గా తీసి రాజు గారి గది 2 చిత్రాన్ని తీశారు. ఓంకార్[4] దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సమంత, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్[5] ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13 న విడుదల అయింది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. రాజు గారి గది 3 అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18 న విడుదల అయింది.