లక్ష్మీ మాల్ సింగ్వి (నవంబర్ 9, 1931 - అక్టోబర్ 6, 2007) ఈయన భారతీయ న్యాయవాది, పండితుడు, రచయిత, దౌత్యవేత్త. ఈయనకు 1998 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఈయన 1931, నవంబర్ 9 న రాజస్థాన్ లోని జోధ్పూర్ లో మార్వారీ జైన్ కుటుంబంలో జన్మించాడు. ఈయనకు ఇద్దరు సోదరులు, ప్రసాన్ మాల్ సింగ్వి, గులాబ్ మాల్ సింగ్వి, ఇద్దరు సోదరీమణులు, పుష్పా సెట్ట్, చంద్ర భండారి ఉన్నారు. ఈయన 1954 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి, 1955లో కార్నెల్ విశ్వవిద్యాలయంలో జెఎస్‌డి విద్యను అభ్యసించారు. 1955 లో కార్నెల్ లా స్కూల్‌లో చదువు పూర్తి చేశారు.
న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత ఈయన జోధ్పూర్ ట్రయల్, సెషన్స్ కోర్టులలో తన న్యాయవాద ప్రాక్టీసును ప్రారంభించాడు. 1962 లోక్ సభ ఎన్నికల్లో జోధ్పూర్ (లోక్ సభ నియోజకవర్గం) నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఈయన లోక్ సభ సభ్యుడిగా ఉన్నంత కాలం తన న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్నాడు. ఈయన 1972-77 మధ్య రాజస్థాన్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పనిచేశాడు. దీని తరువాత ఈయనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించారు.
ఈయన తన స్వస్థలమైన జోధ్‌పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలల్లో పోటీచేసి గెలుపొందాడు. కానీ 1967 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారతదేశం తరపున హైకమిషనర్ గా పనిచేశాడు. 1997 లో హై కమిషర్ గా పనిచేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈయన 1998 - 2004 మధ్యకాలంలో రాజ్యసభకు ఎంపీ గా పనిచేశాడు. ఈయన భారత డయాస్పోరాపై ఉన్నత స్థాయి కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.[1]
ఈయనను 1991 లో ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు సెయింట్ జేమ్స్ కోర్టుకు హైకమిషనర్ గా నియమించాడు. 1993 లో ఈయన హై కమిషనర్‌గా ఉన్న కాలంలో, వియన్నాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి సింగ్వి నాయకత్వం వహించాడు. ఈయన ది హేగ్‌లోని శాశ్వత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సభ్యుడుగా ఉన్నాడు.
ఈయన ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనేక పుస్తకాలు రాశాడు. వీటిలో ఎ టేల్ ఆఫ్ త్రీ, జైన దేవాలయాలు, భారత్ హమారా సమయ్ ("భారతదేశం, మన కాలాలు") ఉన్నాయి. ఈయన ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఈయనకు 1993 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[2][3] బకింగ్‌హామ్ విశ్వవిద్యాలయం ఎల్‌ఎల్‌డి గౌరవ డిగ్రీ ప్రదానం చేసింది. ఈయనకు సుప్రీంకోర్టు జనవరి 17, 2009 న 'లా, టెక్నాలజీ అండ్ సొసైటీ: ఇట్స్ డైనమిక్స్' పై 'మొదటి స్మారక ఉపన్యాసం నిర్వహించింది. జోధ్పూర్ లోని నేషనల్ లా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లాకు ఈయన పేరు పెట్టారు.[4]
ఈయన కమలా ను వివాహం చేసుకున్నాడు. ఇతని భార్య రచయిత. ఈమె ధారావాహికలు, కథలు హిందీ భాషా పత్రికలలో ప్రచురించబడుతాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి ఏకైక కుమారుడు అభిషేక్ మను సింగ్వి న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన రాజ్యసభ ఎగువ సభ సభ్యుడు. ఈయన కుమార్తె అభిలాషా సింగ్వి మానవ్ సేవా సన్నిధి ఎన్జీఓకు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.
ఈయన అక్టోబర్ 6, 2007 న న్యూఢిల్లీ లో అనారోగ్యం కారణంతో మరణించాడు.