వి.పి.ధనంజయన్ | |
---|---|
![]() శాంతా ధనంజయన్‌తో వి.పి.ధనంజయన్ | |
బాల్య నామం | వన్నదిల్ పుదియవీత్తిల్ ధనంజయన్ |
జననం | పయ్యనూర్, కేరళ, భారతదేశం | 1939 ఏప్రిల్ 17
వన్నదిల్ పుదియవీత్తిల్ ధనంజయన్ (జ.1939) ఒక భరతనాట్య కళాకారుడు. తన భార్య శాంతా ధనంజయన్‌తో కలిసి జంటగా భరతనాట్య ప్రదర్శనలు చేశాడు.
ఇతడు కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లా, పయ్యనూర్ గ్రామంలో 1939, ఏప్రిల్ 17న ఒక మలయాళీ పొదువల్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రికి 8 మంది సంతానం. కుటుంబ పోషణ కష్టమైన సమయంలో ఒక సారి ఇతని తండ్రి కథాకళి గురువు చందు పణికర్‌ను కలిశాడు. అతని సలహాపై ధనంజయన్‌ను చెన్నైలోని కళాక్షేత్రకు పంపించాడు. ఇతడు 1953లో కళాక్షేత్రలో చేరాడు. అక్కడ రుక్మిణీదేవి అరండేల్ వద్ద 1955 నుండి 1967 వరకు నాట్యం నేర్చుకున్నాడు. ఇతడు ఉపకారవేతనం పొందుతూ కళాక్షేత్ర నుండి నాట్యంలో పట్టా పుచ్చుకున్నాడు. భరతనాట్యం, కథాకళిలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఐచ్చికాంశాలుగా ఇతడు బి.ఎ.డిగ్రీని కూడా పుచ్చుకున్నాడు. కళాక్షేత్రలో ఇతడు భరతనాట్యం, కథాకళితో పాటుగా మృదంగం, కర్ణాటక గాత్ర సంగీతం కూడా అభ్యసించాడు. రుక్మిణీదేవి అరండేల్, చందు పణికర్‌తో పాటు ఎన్.ఎస్.జయలక్ష్మి, శారదా హాఫ్‌మన్ మొదలైన వారు ఇతని గురువులు.
కళాక్షేత్రలో ఉన్నప్పుడు ఇతడు శాంతను తొలిసారి చూశాడు. ఆమె 1952లో ధనంజయన్ కంటే ముందే కళాక్షేత్రలో నాట్యం నేర్చుకుంటూ ఉంది. ఆమె నాట్యం, సంగీతం నేర్చుకోవడంలో తలమునకలై ఉన్నప్పటికీ తన 12 యేళ్ళ వయసులో ధనంజయన్ పట్ల మనసులో ప్రేమను పెంచుకుంది. ఆమెకు 18 యేళ్ళ వయసు వచ్చినప్పుడు ధనంజయన్ ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే ఆమె ఏ సమాధానం చెప్పకుండా తన చదువు పూర్తయ్యాక మలేసియా వెళ్ళిపోయింది. తిరిగి 4 సంవత్సరాల తర్వాత భారతదేశం తిరిగి వచ్చినప్పుడు తన సమ్మతిని తెలియజేసింది. వీరి వివాహం 1996లో కేరళ లోని గురువయ్యూర్ దేవాలయంలో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సంజయ్ అమెరికాలో నివసిస్థున్నాడు. రెండవ కుమారుడు సత్యజిత్ ఒక ఫోటోగ్రాఫర్, నర్తకుడు. అతడు తన భార్యాపిల్లలతో చెన్నైలో నివసిస్తున్నాడు.[1][2]
ఈ జంట 1960ల చివరలో కళాక్షేత్ర వదిలి తమ వృత్తిని స్వంతంగా అభివృద్ధి చేసుకున్నారు. వీరు తమ నూతన ఆలోచనలతో జీవత్వం ఉట్టి పడే నాట్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలలోను, విదేశాలలోను ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానాలు అందాయి. వీరు ప్రపంచమంతటా తిరిగి తమ కళాప్రదర్శన గావించారు. ఈ జంట వోడాఫోన్ ప్రకటనలో "ఆశా & బాలా"గా నటించారు.
వీరు ప్రదర్శించిన నృత్యాలలో కొన్ని ముఖ్యమైనవి:[3]
ధనంజయన్ దంపతులు అనేక మంది శిష్యులకు భరతనాట్యాన్ని నేర్పించారు. వీరు తమ శిష్యులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి నొక్కి వక్కాణించారు.
వీరు 1968లో అడయార్, చెన్నైలో "భారత కళాంజలి" పేరుతో నాట్యపాఠశాలను ప్రారంభించారు. మొదట కొద్ది మందితో ఆరంభమైన ఈ స్కూలు ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులతో సంగీత నృత్యాలలో ప్రధానమైన సంస్థగా ఎదిగింది.
ఈ జంట ధనంజయన్ స్వగ్రామమైన కేరళలోని పయ్యనూర్‌లో భాస్కర అకాడమీని ప్రారంభించింది. ఈ అకాడమీ ద్వారా ప్రతి యేటా వేసవి నాట్య గురుకులం క్యాంపును నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ అకాడమీ మూతపడింది.
ఈ జంట అమెరికా వర్జీనియా యోగావిల్లెలోని సచ్చిదానంద ఆశ్రమంలో 1988 నుండి వార్షిక వేసవి గురుకులం క్యాంప్ నిర్వహిస్తున్నది. వీరు నాట్య అధ్యయన గురుకులాన్ని అభివృద్ధి చేశారు. ఇది కళలకు అంకితమైన పూర్తికాల రెసిడెన్షియల్ కోర్సు. ఈ కోర్సులో ఇండో అమెరికన్ విద్యార్థులు, అంతర్జాతీయ విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ జంటకు లభించిన ముఖ్యమైన పురస్కారాలు కొన్ని:
ఇతడు అనేక సాంఘిక సమస్యలపై, వర్తమాన రాజకీయాలపై తన గొంతుకను వినిపించి కీర్తిని గడించాడు. ఇతని పుస్తకం "బియాండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ కల్చర్"లో ఇతడు భారతదేశంలో కనిపిస్తున్న ప్రస్తుత సాంఘిక రాజకీయ విషయాలపై చర్చ చేశాడు.[5]
ఇతడు నాట్యపరమైన విషయాలతో పాటుగా వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపై విస్తృతంగా రచనలు చేశాడు.
వాటిలో ముఖ్యమైనవి:
{{cite web}}
: no-break space character in |title=
at position 26 (help)